Skip to main content

Inter First Year Admissions: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మీషన్స్‌ షురూ..చివరి తేదీ ఎప్పుడంటే..

 Admissions Schedule  Complete Admissions by 31st May  Inter First Year Admissions  Karimnagar: Intermediate First Year Admissions

కరీంనగర్‌: ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు షురూ అయ్యాయి. 2024–25 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా ప్రవేశాలకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 31వరకు మొదటి విడత అడ్మిషన్లు పూర్తి చేసి వచ్చేనెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభించేలా కార్యాచరణ ప్రకటించింది.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌, ఇతర సంక్షేమశాఖల కళాశాలలు మొత్తం 108 ఉన్నాయి. ప్రైవేట్‌ మినహా మిగతా కాలేజీల్లో విద్యార్థులకు ఉచిత దుస్తులు, వసతి, పుస్తకాల పంపిణీ, ఇతరత్రా సౌకర్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. కాగా మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ మొదలైంది.

TS Best Available School Scheme Admission: పేద విద్యార్థులకు ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచితంగా అడ్మీషన్‌.. వీళ్లు అర్హులు

వసతులపై ప్రచారం
ప్రభుత్వ, వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. గ్రామాల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల వివరాలు సేకరిస్తూ వారి తల్లిదండ్రులతో మాట్లాడుతూ కళాశాలల్లో ఉన్న వసతులపై కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

AP EAMCET Answer Key 2024: ఏపీ ఎంసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రైవేట్‌ కాలేజీలకు దీటుగా కరపత్రాలు, ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తూ అడ్మిషన్ల పెంపును వేగవంతం చేయాలని ఇంటర్‌ అధికారులు సూచించడంతో ఆ దిశగా ప్రిన్సిపాల్స్‌, జూనియర్‌ లెక్చరర్లు ఎక్కడికక్కడా వసతులపై ప్రచారం నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.

Published date : 24 May 2024 01:30PM

Photo Stories