Skip to main content

AP EAMCET Answer Key 2024: ఏపీ ఎంసెట్‌ ప్రిలిమినరీ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

AP EAPSET Engineering Preliminary Key  Download AP EAPSET key from official website  AP EAMCET Answer Key 2024  Higher Education Council announcement

ఏపీ ఈఏపీసెట్‌(ఎంసెట్‌)ఇంజనీరింగ్‌ ప్రిలిమినరీ కీని ఉన్నత  విద్యామండలి విడుదల చేసింది.నిన్న అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ కీ విడుదల చేసిన అధికారులు నేడు(శుక్రవారం)ఇంజనీరింగ్‌ కీని రిలీజ్‌ చేశారు. అభ్యర్థులు ఈనెల 26న ఉదయం 10 గంటలలోపు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఉన్నత విద్యామండలి సూచించింది.

TSPSC Group-1 Exam: జూన్‌-9న గ్రూప్‌-1 పరీక్ష.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..
మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లు, రెస్పాన్స్‌ షీట్లను కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌గా, ఇంజినీరింగ్ విభాగానికి మే 18 నుంచి 23 వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 

AP EAPCET

అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ విభాగాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,39,139 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రాథమిక కీని విడుదల చేశారు. అభ్యర్థులు  https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

 

Published date : 24 May 2024 01:08PM

Photo Stories