INSPIRE Manak : ఇన్స్‌పైర్ మనక్‌కు విద్యాశాఖ శ్రీకారం.. ఐడియా బాక్స్‌తో..
మదనపల్లె సిటీ: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా రూపొందించేందుకు ఇన్‌స్పైర్ మనాక్‌కు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2024–25లో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవల ఉపాధ్యాయులకు డివిజన్ స్థాయిలో మదనపల్లె, రాయచోటి, రాజంపేట,పీలేరులలో సమావేశాలు నిర్వహించి, విధి విధానాలు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, ఇంటర్‌నెట్‌లో ఎలా దరఖాస్తు చేయాలో చూపించారు.
Paris Paralympics: పారిస్ పారాఒలింపిక్స్.. పతాకధారులుగా భాగ్యశ్రీ, సుమిత్
జాతీయ స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులతో సూచనలు, సలహాలు ఇప్పించారు. ఇందులో పాల్గొనేందుకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. గత ఏడాది 2,700 మాదిరిగానే ఈ సారి దీని కంటే ఎక్కువగా దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇన్‌స్పైర్ మనక్‌కు దరఖాస్తు చేయాలి. ముందస్తుగా ఏఏ ప్రాజెక్టులు తయారు చేసుకోవాలో నిర్ణయించుకోవాలి. వాటికి సంబందించిన చార్టులు రూపొందించి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎక్కువ మంది ఎంపిక కావాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
KC Venugopal: పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్‌గా వేణుగోపాల్
ప్రతి పాఠశాలలో ఐడియా బాక్సు
ప్రతి పాఠశాలలో ఐడియా బాక్సు ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం పాఠశాల అసెంబ్లీ, సాయంత్రం 30 నిమిషాలు విద్యా ర్థులతో చర్చించాలి. ఇలా చర్చించాక ఉత్తమమైన నమూనా తయారు చేయించాలి. ఎంపికై తే ప్రయోగం చేసేందుకు విద్యార్థికి రూ.10 వేలు అందిస్తారు.
Sarvai Papanna : పేదలకు దోచిపెట్టిన వీరుడు.. ఇప్పటికీ నిలిచిపోయిన కట్టడాలు.. ఇదే ఆయన కథ..
ఎక్కువ దరఖాస్తులు చేసేలా..
ఎక్కువ దరఖాస్తులు సమర్పించేలా ఈ విషయమై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలి. ఎటువంటి సందేహాలున్నా నేరుగా సంప్రదించవచ్చు. ఎక్కువ మంది ఎంపిక కావడమే లక్ష్యం.
–మార్ల ఓబుల్‌రెడ్డి, జిల్లా సైన్సు అధికారి