Inspire Manak Awards: ప్రతిభకు ప్రోత్సాహం
ఉమ్మడి జిల్లా నామినేషన్లు, అవార్డులు
సంవత్సరం | 2016–17 | 2017–18 | 2018–19 | 2019–20 | 2020–21 | 2021–22 |
నామినేషన్లు | 3200 | 5010 | 2470 | 3250 | 1853 | 1720 |
జిల్లా స్థాయి అవార్డులు | 320 | 499 | 246 | 321 | 180 | 172 |
జాతీయస్థాయి అవార్డులు | 32 | 50 | 25 | 31 | 18 | 16 |
అంతర్జాతీయ అవార్డులు | 03 | 05 | 03 | 02 | 02 | –– |
రాష్ట్రపతి భవన్‌లో అత్యున్నత పురస్కారం | 01 | 01 | 01 | –– | –– | –– |
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీసి.. వారిని భావి భారత శాస్త్రవేత్తలు, మేధావులుగా ఇప్పటి నుంచే తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్ మనక్ అవార్డుల పథకాన్ని అమలు చేస్తోంది.మన చుట్టూ ఎందరో బాల మేధావులు ఉంటారు. తాము చూసిన అంశానికి నూతనత్వం జోడిస్తే అది మరింత మెరుగైన అంశంగా రూపొందించవ్చనే ఆలోచన వారి మస్తిష్కంలో ఉంటుంది. చిన్నపిల్లలు కావడంతో వారి మాటలను పట్టించుకునే వారు కనిపించరు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ 2009– 10 నుంచి ఇన్‌స్పైర్ మనక్‌కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
District Education Officer: విద్యార్థులతో సైన్స్ ప్రాజెక్టు నమూనాలు తయారు చేయండి
లక్ష ప్రతిపాదనల వరకూ పరిశీలన
విద్యార్థుల ఆలోచనలకు మరింత పదును పెట్టి వారికి సరైన మార్గదర్శనం చేసేందుకు సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఈ మేరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ పాఠశాల విద్యార్థుల మానసిక వికాసానికి సంబంధించిన పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల్లో ఈ కార్యక్రమాలపై అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో అంతర్గత పోటీలు నిర్వహించి విద్యార్థుల మస్తిష్కంలో పుట్టిన ఆలోచనలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. వీటిలోంచి అత్యుత్తమమైన ప్రతిపాదనలను ఎంపిక చేసి వాటిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇన్‌స్పైర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. దేశ వ్యాప్తంగా ఆయా పాఠశాలల నుంచి వచ్చిన ప్రతిపాదనలను బేరీజు వేసి వాటిలోంచి లక్ష ప్రతిపాదనల వరకూ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ పరిశీలించి ఎంపిక చేస్తుంది.
AP Govt Schools: ఐఎఫ్‌పీతో విద్యాబోధనలో నూతన ఒరవడి
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టులకు రూ.10 వేలు
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఎంపిక చేసిన ప్రతి ప్రాజెక్టును జిల్లాల వారీగా విడదీసి ఆ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థి ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. విద్యార్థి ఖాతాలో జమైన నగదుతో ప్రాజెక్టును భౌతికంగా అభివృద్ధి చేసి వాటిని జిల్లా స్థాయిలో నిర్వహించే సైన్స్ ప్రదర్శనలో ఉంచుతారు. ఈ ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన ప్రాజెక్టును రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికై న వాటిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రాజెక్టుల నమూనాలను మరింత మెరుగుపరుచుకోవడానికి శాస్త్ర, సాంకేతిక మండలి ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థికి మరో రూ. 25 వేలు మంజూరు చేస్తుంది.
విద్యార్థుల్లో మేధను వెలికితీస్తున్న ఇన్‌స్పైర్ మనక్‌నూతన ప్రాజెక్టుల రూపకల్పనకు మార్గదర్శనం జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుకు రూ.10 వేలు
అంశాలు ఇవే
విద్యార్థులు తాము ఏ అంశాలపై ప్రాజెక్టులను రూపొందించాలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సూచించింది. సమాజానికి ఉపయోగపడే శాసీ్త్రయ ఆలోచనలు, ఆవిష్కరణ అంశాలను ఎంపిక చేసుకోవాలి. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, సమాజాభివృద్ధి అంశాలపైనే ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కాక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకూ వర్తిస్తుంది. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 10 నుంచి 15 ఏళ్ళ వయసు లోపు విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక అంశాల్లో ఉండే ప్రతిభకు పదును పెట్టేందుకు ఇన్‌స్పైర్ మనక్ చక్కని వేదిక. ఈ మేరకు జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు డివిజన్ స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు.
Job Opportunities: గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు
బాల శాస్త్రవేత్తలకు గొప్ప అవకాశం
శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే బాలలకు ఇది గొప్ప అవకాశం. వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి, తమలోని సృజనాత్మక శక్తికి పదును పెట్టడానికి ప్రభుత్వం నుంచి సహకారం ఈ అవార్డుల ద్వారా సహకారం లభిస్తుంది. సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన కలిగితే వాటిపై మనసులో కలిగే స్పందన ఆధారంగా ఉత్తమ ప్రాజెక్టుల రూపకల్పన సాధ్యమవుతుంది.
– సీహెచ్‌ఆర్‌ఎం చౌదరి, జిల్లా సైన్స్ అధికారి
ప్రతి పాఠశాల నుంచి దరఖాస్తులు ఉండాలి
జిల్లాలో ప్రతి పాఠశాల నుంచి ఇన్‌స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తులు తప్పనిసరిగా ఉండాలి. ఉన్నత పాఠశాలల నుంచి కనీసం 5 ప్రాజెక్టులు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి కనీసం 3 ప్రాజెక్టులు పోటీలకు పంపేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఏడాది కూడా జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా సైన్స్ ఉపాధ్యాయులు వారికి మార్గనిర్ధేశనం చేయాలి.
– పీ.శ్యామ్ సుందర్, ఏలూరు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి