AP Govt Schools: ఐఎఫ్‌పీతో విద్యాబోధనలో నూతన ఒరవడి
రాజాం సిటీ: ప్రభుత్వ పాఠశాలలకు ఐఎఫ్‌పీ బోర్డులు అందించి విద్యాబోధనలో నూతన ఒరవడికి జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టిందని డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల విద్యాప్రమాణాలు మెరుగుపడేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఎఫ్‌ఏ–1 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి తక్కువ మార్కులు వచ్చిన వారికి మరళా పరీక్ష నిర్వహించాలని సూచించారు. కొత్తగా ప్రవేశపెట్టిన టోఫెల్‌ను చక్కగా నిర్వహించాలని, విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించి స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పి.నాగయ్య, పాఠశాల స్టాఫ్ కార్యదర్శి బీవీ అచ్యుత్‌కుమార్, డీఈఓ సీసీ లక్ష్మణరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Open Schoos: ఓపెన్ స్కూల్‌తో నిరంతర విద్య
దేవుదల కేజీబీవీ సందర్శన
రేగిడి: మండలంలోని దేవుదల కేజీబీవీను డీఈఓ లింగేశ్వరరెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతిరోజు విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించాలని ఎస్‌ఓ లక్ష్మికి సూచించారు. అనంతరం లింగాలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి నాడు–నేడు పనులు సకాలంలో పూర్తి చేయాలని హెచ్‌ఎం కృష్ణారావుకు సూచించారు. లక్ష్మీపురం ఉన్నత పాఠశాల, మోడల్ ప్రాథమిక పాఠశాలను సైతం సందర్శించారు.