Skip to main content

ఓపెన్‌ స్కూల్‌తో నిరంతర విద్య

Open School
Open School

పాపన్నపేట(మెదక్‌): చదువు మధ్యలో ఆపేసిన వారికి ఓసెన్‌ స్కూల్‌ చక్కని అవకాశమని ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ వెంకట్‌ స్వామి అన్నారు. బుధవారం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. వయసుతో సంబంధం లేకుండా నిరంతర విద్యకు ఓపెన్‌ స్కూల్‌ ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 10లో పు దరఖాస్తు చేసుకోవాలని, ఫైన్‌తో ఈనెల 31 వ రకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్‌ హరిసింగ్‌, నరేందర్‌, టీచర్లు పాల్గొన్నారు.

బడి మానేసిన వారికి వరం..

పెద్దశంకరంపేట(మెదక్‌)బడి మానేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ వరమని ఉమ్మడి జిల్లా ఆర్డినేటర్‌ వెంకటస్వామి అన్నారు. పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్లను ఆయన పరిశీలించారు. ఓపెన్‌స్కూల్‌లో ఎస్సెస్సీ, ఇంటర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం విఠల్‌, ఖాదిర్‌, ప్రవీణ్‌ తదితరులున్నారు.

Published date : 10 Aug 2023 05:16PM

Photo Stories