Skip to main content

Gurukul School Students Record: ఈ రికార్డుల్లో స్థానం దక్కించుకున్న గురుకుల విద్యార్థులు

రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న గురుకుల విద్యార్థులు తమ ప్రతిభను చూపి అందులో రెండు రెకార్డులను సాధించుకున్నారు..
Telugu Book of Records achievement   Gurukul Students achieves their position in Telugu Book of Records  Self instructional videos explaining 3,600 projects uploaded by students to YouTube

తాడేపల్లిగూడెం రూరల్‌: పెదతాడేపల్లిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు రెండు రికార్డులను దక్కించుకున్నారు. గురుకులానికి చెందిన విద్యార్థులు హాయ్‌ మమ్మీ... హాయ్‌ డాడీ కార్యక్రమం ద్వారా 3,600 ప్రాజెక్టులను వివరిస్తున్న స్వీయ బోధన వీడియోలను చిత్రీకరించి, తల్లిదండ్రులకు పంపించారు. వీటిని యూట్యూబ్‌ నిక్షిప్తం చేయడం ద్వారా తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది.

Facilities in Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సర్కారు శ్రీకారం..

అలాగే, అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా 500 మంది విద్యార్థులు 500 అంబేడ్కర్‌ చిత్రాలను గీయడం ద్వారా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్‌ బి.రాజారావు, వైస్‌ ప్రిన్సిపల్‌ బి.ప్రతాప్‌, ఉపాధ్యాయ సిబ్బంది ఆనందరావు, బలరాం, డి.కృష్ణ, నవీన్‌, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని అభినందించారు.

Tenth to University Exams: టెన్త్‌ నుంచి యూనివర్సిటీ పరీక్షల వరకు ప్రక్షాళన చేయాల్సిందే..!

Published date : 15 Apr 2024 03:30PM

Photo Stories