Gullipalli Simhadrappa: ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి సింహాద్రప్పడు
సింహాద్రప్పడు సంస్మరణ కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మర్రిపాలెం అంబేడ్కర్ సామాజిక భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏపీటీఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కొటాన శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం అలుపెరుగని నాయకుడిగా పోరాట చేశారని ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఆయన చెప్పారు. ఆయన సేవలు ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయులు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కష్టాలను తీర్చే నాయకుడిగా సింహాద్రప్పడు ఉపాధ్యాయుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. భోపాల్ ప్రాంతీయ విద్యా సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రొఫెసర్ బుర్రా రమేష్ బాబు ‘‘విద్య–జ్ఞాన ప్రయివేటీకరణ’’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు.
Also read: UPSC Topper Bhuvana Pranith Pappula: సక్సెస్ మంత్రా..#sakshieducation
సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాథ్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి బి.వెంకటపతిరాజు, విశాఖ జిల్లా కార్యదర్శి తమలాల రామకృష్ణ , అనకాపల్లి జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి సన్యాసినాయుడు, ఏఎస్‌ఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రావుల జగన్‌మోహనరావు, కొర్రా ధనుంజయ్, విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిరిపురపు పెద్దినాయుడు, డి.శ్రీనివాస్, డీటీఎఫ్ రాష్ట్ర క్యాదర్శి మధు, విజయనగరం జిల్లా ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జోగినాయుడు, ఆడారి కిషోర్ కుమార్, వెయ్యిమందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Also read: CM Jagan Good News: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల #sakshieducation