Skip to main content

Education Sector: విద్యారంగంపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదు

Education Sector
విద్యారంగంపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదు

ఇబ్రహీంపట్నం రూరల్‌: విద్యారంగంపై ప్రభుత్వానికి చిన్నచూపు తగదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. మధ్యాహ్న భోజనానికి నిధులు మంజూరు చేయకపోవడంతో నాణ్యమైన భోజనం అందడం లేదని మండిపడ్డారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న డిగ్రీ కళాశాలకు నేటికీ సొంత భవనాలు కరువయ్యాయని తెలిపారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రణయ్‌, బి.శంకర్‌, ఉపాధ్యక్షులు చరణ్‌, శివ, తదితరులు పాల్గొన్నారు.

TS TET 2023 Bitbank: చాప్టర్ల వారీగా Perspectives in Education ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

TS TET 2023 Environmental Science Bitbank: టాపిక్ వారీగా ఫ్రీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్

ఇవీ చ‌ద‌వండి: పరిగి మోడల్‌ స్కూల్‌లో బోధనకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 22 Aug 2023 04:10PM

Photo Stories