Skip to main content

Free training: డిగ్రీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

శ్రీకాకుళం రూరల్‌: డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పేషెంట్‌ రిలేషన్స్‌ అసోసియేట్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు బొల్లినేని మెడిస్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free training for degree students

కృష్ణా జిల్లా నందిగామలోని కిట్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, కిమ్స్‌ రీసెర్చ్‌ అండ్‌ ఫౌండేషన్‌ సహకారంతో హైదరాబాద్‌లో శిక్షణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. రెండు నెలల శిక్షణ పూర్తయిన వెంటనే కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు రాగోలు జెమ్స్‌ ఆస్పత్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్‌ విభాగాన్ని (సెల్‌: 76809 45357, 79950 13422 నంబర్లు) సంప్రదించాలన్నారు.

చ‌ద‌వండి: Scholarship: ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్‌లకు ప్రకటన విడుదల.. ఎంపికైతే ఏటా రూ.50వేలు ఉపకార వేతనం

Published date : 25 Nov 2023 02:04PM

Photo Stories