Free Spoken english Classes: ఇంగ్లిష్ స్పీకింగ్‌లో ఉచిత శిక్షణ
విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయని చెబుతూ.... ఆసక్తి ఉన్నవారి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు.
‘‘మా ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లిష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్‌లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘అని చెప్పారాయన. ఈజీ ఇంగ్లిష్ ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు.
చదవండి: A Passage to India: వంద గొప్ప నవలల్లో ఒకటిగా పరిగణన పొందిన నవల ఇదే..
ఏప్రిల్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. ‘‘ఈ కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది.
లేనిపక్షంలో 98660 06662 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్‌కు లింకును పంపిస్తాం’’అని వివరించారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 12వ తేదీ వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.