Skip to main content

Andhra Pradesh Schools: అమ్మ ఒడి.. సర్కారు బడి.. జగన్‌ ఇచ్చిన నమ్మకం

(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): దారుణమైన అబద్ధాలు చెబుతున్నామనే సిగ్గెగ్గులు లేవు!.
AP Government Schools

పత్రిక పేరుతో పచ్చి విషాన్ని గుమ్మరిస్తున్నామన్న సోయ లేదు!. 
చంద్రబాబు కోసం పూర్తి దిగంబరంగా మారిపోయామన్న ధ్యాసే.. లేదు! 
ఇదీ... ‘ఈనాడు’పత్రిక, దాని యజమాని రామోజీరావు తీరు. ఎన్నికల ముంగిట చంద్రబాబును జాకీలు పెట్టి లేపడమే లక్ష్యంగా... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలతో చెలరేగిపోతున్నారు రామోజీరావు. తన రాతల్ని జనం ‘ఛీ’కొడుతున్నారని తెలిసినా లైట్‌ తీస్కుంటూ పూర్తిగా దిగజారిపోయారు ఈ నారా వారి కూలీ!. సోమవారం అచ్చేసిన ‘అమ్మ ఒడికి.. మామ కత్తెర’కూడా ఇలాంటిదే. దీని వెనక నిజానిజాలివిగో...  
‘అమ్మ ఒడి’పథకాన్ని ఇద్దరు పిల్లలకు ఇస్తామని వైఎస్‌ జగన్‌ మీకెప్పుడు చెప్పారు రామోజీరావు గారూ? ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏముందో కాస్తయినా చూశారా? మేనిఫెస్టోని చూసే కదా.. జనం ఓట్లేసి అఖండ విజయాన్ని అందించారు. మరి ఆ మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంటే లేనిపోని అబద్ధాలతో ఎందుకీ పెడబొబ్బలు? ‘‘పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లీ భయపడకూడదు. పిల్లలను బడికి పంపితే చాలు. ఆ తల్లికి సంవత్సరానికి రూ.15,000 ఇస్తాం.’’అనే హామీని మేనిఫెస్టోలో పొందుపరిచారు వైఎస్‌ జగన్‌. ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని తు.చ. తప్పకుండా తొలి ఏడాది నుంచే అమల్లోకి తెచ్చారు. 2019 జూన్‌లో అధికారం చేపట్టడంతో... అప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి... స్కూళ్లు తెరిచే సమయం కనక... ఆ ఏడాది జనవరిలో తొలిసారి అమ్మ ఒడిని అందించారు. ఏకంగా 42 లక్షల 33వేల 98 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,350 కోట్లను జమ చేశారు.  

చదవండి: AP Ssc 10th Class Results State Topper: ఏపీ టెన్త్‌ ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌ మనస్వికి 599 మార్కులు..ఆ ఒక్క మార్కు ఎందులో పోయిందంటే..

కోతలు పెట్టిందెక్కడ?  

మూడేళ్లలో 1.86 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటూ మరో దారుణమైన అబద్ధాన్ని అలవోకగా వండేశారు ఈ ఎల్లో జర్నలిస్టు. నిజానికి 2019లో అధికారం చేపట్టిన జగన్‌... ఆ ఏడాది అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందేట్లు చూశారు. దీంతో 2019–20లో ఏకంగా 42.33 లక్షల మంది తల్లులకు ఈ పథకం కింద రూ.6,349 కోట్లు అందాయి. ఇక తాజాగా గతేడాది... అంటే 2022–23లో 42.62 లక్షల మందికి ఈ పథకం కింద రూ.6,393 కోట్లు జమయ్యాయి. అంటే తొలి ఏడాదితో పోల్చినపుడు దాదాపు 29 వేల మంది పెరిగారు తప్ప... ఒక్కరంటే ఒక్కరు కూడా తగ్గలేదు. ఇదీ... వాస్తవం. 

చదవండి: Gurukul School Tenth Students: పదో తరగతి పరీక్షల్లో మెరిసిన ప్రభుత్వ గురుకుల విద్యార్థులు.. గతేడాది కంటే!

కోవిడ్‌ కష్ట కాలంలోనూ... సంఖ్య పెరిగినా సరే 

జగన్‌ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...‘కేరాఫ్‌ కమిట్‌మెంట్‌’అనాలి. ఎందుకంటే 2020– 21లో కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసినపుడు అందరి ఆదాయాలూ పడిపోయాయి. కేంద్రంతో సహా దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ సంక్షేమ పథకాలను నిలిపేశాయి. కానీ జగన్‌ మాత్రం సంక్షేమ పథకాల అవసరం ఆ సమయంలోనే ఎక్కువ ఉందని భావించారు. పేదలకు భరోసా ఇస్తూ... మరింత మందికి పథకాలను చేరువ చేశారు. చాలామంది వ్యాపారాలు లేక, వృత్తిపనులు పోయి పేదరికంలోకి జారిపోయారు. వారంతా కొత్తగా నమోదు చేసుకోవటంతో ఆ ఏడాది అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది.

2019–20లో 42.33 లక్షలుగా ఉన్న సంఖ్య 2020–21లో కోవిడ్‌ వల్ల ఏకంగా 44.48 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం పెద్ద మనసుతో ఏకంగా రూ.6,673 కోట్లను లబ్ధిదారులకు జమ చేసింది. కానీ తరవాతి ఏడాది నుంచీ మళ్లీ పరిస్థితులు చక్కబడటం మొదలెట్టాయి. వృత్తి పనులు, చిరు వ్యాపారాలు మళ్లీ పుంజుకుని 2022–23 నాటికి ఆదాయాలు యథాపూర్వ స్థితికి వచ్చాయి. దీంతో వారి వారి ఆదాయ పరిమితులకు లోబడి లబ్ధిదారులూ తగ్గి... పూర్వం కన్నా కాస్త ఎక్కువగా... అంటే  42.62 లక్షలకు చేరుకున్నారు. ఇదీ జరిగింది. దీన్నెవరైనా కోత పెట్టడం అంటారా? నిబంధనలు విధించి ఆ మేరకు లబ్ధిదారుల్ని తగ్గించేశారన్న ఆరోపణలో ఏ కొంచెమైనా వాస్తవం ఉందా? ఎందుకు రామోజీరావ్‌ ఇంత దారుణమైన రాతలు?  

అయిదేళ్లలో నాలుగుసార్లే.. అంటే ఎలా? 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడింది 2019 జూన్‌లో. అప్పటికే అడ్మిషన్లు పూర్తయి, స్కూళ్లు మొదలవుతున్నాయి. ప్రభుత్వం కుదురుకుని, డేటాను సమీక్షించడానికి కొంత సమయం పడుతుంది. అయినా సరే... ఇచ్చిన మాట ప్రకారం ఆ ఏడాది మొత్తాన్ని జనవరిలో తల్లుల ఖాతాల్లో జమ చేశారు జగన్‌.

తరువాతి ఏడాది కూడా జనవరిలోనే ఇచ్చినా... మరుసటి ఏడాది నుంచీ అనుకున్నట్టే జూన్‌లో అడ్మిషన్లకు ముందు జమచేయటం ప్రారంభించారు. ఇప్పటికి నాలుగేళ్లుగా నగదు జమచేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా జూన్‌లో జమ చేస్తారు. కానీ రామోజీరావు మాత్రం... ఈ ఏడాది ఇంకా జమ చేయలేదంటూ చేతికొచ్చిన రాతలు రాయటం దివాలాకోరు తనం కాక మరేమిటి? 

ల్యాప్‌టాప్‌లపైనా... దౌర్భాగ్యపు రాతలే 

‘లబ్ధిదారులు కోరుకుంటే 9–12 తరగతుల పిల్లలకు అమ్మ ఒడికి బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని చెప్పిన జగన్‌... ఆ తరవాత మాట తప్పారన్నది రామోజీరావు చేసిన మరో పనికి మాలిన ఆరోపణ.  
లబ్ధిదారులు కోరుకుంటే... అమ్మ ఒడికి బదులుగా 9–12 తరగతుల పిల్లలకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒకదశలో చేసిన ఆలోచన. కానీ ఈ ఆలోచన ఆచరణలోకి రాకుండానే.. ప్రభుత్వం చౌకబారు ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అంటగట్టాలని చూస్తోందంటూ... ఇదో పెద్ద కుంభకోణమంటూ ‘ఈనాడు’విషాన్ని కక్కింది. లబ్ధిదారుల స్పందన చూశాక ప్రభుత్వం తన ఆలోచనను సమీక్షించి... అంతకన్నా మెరుగైన నిర్ణయాన్ని ప్రకటించింది.

అమ్మ ఒడిని యథాతథంగా కొనసాగిస్తూనే 8వ తరగతి పిల్లలకు ఏటా ఉచితంగా ట్యాబ్‌లు ఇవ్వాలనేది ఈ నిర్ణయం. ఇలా ఇచ్చే ట్యాబ్‌లు వీరికి ఇంటర్‌ వరకూ పనికొస్తాయనే ఉద్దేశంతో... అంతర్జాతీయ ఎడ్యుటెక్‌ దిగ్గజం బైజూస్‌తో కంటెంట్‌ ఒప్పందం చేసుకుని ట్యాబ్‌ల పంపిణీ ఆరంభించింది. అన్ని తరగతుల పిల్లలకూ బైజూస్‌ కంటెంట్‌ను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. కానీ రామోజీరావు మాత్రం అమ్మ ఒడికి బదులుగా ఇస్తానన్న ల్యాప్‌టాప్‌లు ఇవ్వలేదనే పిచ్చి వాదనే వినిపిస్తున్నారు. అమ్మ ఒడిని కొనసాగిస్తున్నపుడు దానికి బదులుగా అనే మాటెక్కడుంటుంది? 

ట్యాబ్‌లపైనా పెత్తందారీ పోడక... 

ఉచితంగా ట్యాబ్‌లివ్వటం కూడా రామోజీరావుకు సుతరామూ నచ్చలేదు. ఎందుకంటే తాను నడిపిస్తున్న రమాదేవి స్కూల్లో పిల్లలకో, తన మనవలు చదువుతున్న ఇంటర్నేషనల్‌ స్కూల్లోని పిల్లలకో ట్యాబ్‌లు ఉండాలి తప్ప ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకెందుకన్నది ఆయన ఆలోచన.

దీంతో ట్యాబ్‌లలో పిల్లలు చూడకూడనివన్నీ చూస్తున్నారని, వాటి వల్ల చెడిపోతున్నారు కాబట్టి ట్యాబ్‌లు వద్దంటూ పెత్తందార్ల తరఫున కొత్త పల్లవి ఎత్తుకున్నారు. దీనిపై పేద విద్యార్థులంతా మండిపడటమే కాక.. ‘ఈనాడు’పై రాష్ట్ర వ్యాప్తంగా విరుచుకుపడటంతో వెనక్కి తగ్గారు.  

ఆ మొత్తం స్కూల్‌ కమిటీ ఖాతాలకే జమ... 

ఎగురుతున్నపుడు ఎత్తుకు గానీ... జారిపోతున్నపుడు లోతులకు గానీ హద్దులుండవు. రామోజీ రావుదీ అదే పరిస్థితి. ఆయనిప్పుడు లోతెంతో తెలియనంతగా దిగజారిపోతున్నారు. ‘ఈనాడు’మరో ఆరోపణ ఏంటంటే.. పాఠశాల, మరుగుదొడ్లు నిర్వహణ పేరుతో రూ.2 వేలు చొప్పన కోత వేశారనేది. నిజానికి ‘అమ్మ ఒడి’ఆరంభించేనాటికి ‘నాడు–నేడు’కింద స్కూళ్లను బాగు చేయటం మొదలుకాలేదు.

బాగు చేశాక... అవన్నీ సక్రమంగా ఉండాలి కనక 2021లో పాఠశాల నిర్వహణ నిధిని, 2022లో టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. డబ్బులు చెల్లిస్తున్నారు కనక నిర్వహణపై నిలదీసే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం దీన్ని ఆరంభించింది. అమ్మ ఒడి నుంచి మినహాయించిన ఈ నిధులు రూ.2 వేలు నేరుగా స్కూల్‌/ కాలేజీ కమిటీల ఖాతాలకే జమవుతున్నాయి. తక్షణ మరమ్మతుల కోసం ఈ ఖాతాల నుంచే ఖర్చు చేస్తున్నారు. ఇది పేరెంట్స్‌ కమిటీలకు, ప్రజలకు తెలుసు. తెలియనిది రామోజీకే!!.  

టాయిలెట్ల నిర్వహణతో తగ్గిన డ్రాప్‌ అవుట్లు 

నాడు–నేడుతో ప్రతి ప్రభుత్వ బడిలో టాయిలెట్లు నిర్మించారు. అక్కడే దుస్తులు మార్చుకునే గది, వాష్‌ బేసిన్లు, టాయిలెట్లు శుభ్రం చేసే వస్తువులు అందుబాటులో ఉంచారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా బాలికల డ్రాప్‌ అవుట్లు తగ్గిపోయాయి.

రాష్ట్రంలోని 44,800 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 46,661 మంది ఆయాలను నియమించి వారికి నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లలో వీరికి రూ.882 కోట్లు వేతనాలను స్కూలు కమిటీల ఖాతా నుంచే చెల్లించారు. ప్రభుత్వ చదువులంటే గిట్టని రామోజీకి ఇవన్నీ కాస్త అర్థమయ్యేలా చెప్పండర్రా!!. ఆయన్నలా వదిలేయకండర్రా!!.  

Published date : 23 Apr 2024 12:35PM

Photo Stories