Gurukul School Tenth Students: పదో తరగతి పరీక్షల్లో మెరిసిన ప్రభుత్వ గురుకుల విద్యార్థులు.. గతేడాది కంటే!
అమరావతి: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు మళ్లీ సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో వచ్చిన 86.69 శాతం కంటే అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసుకుని మరోసారి ప్రతిభ చూపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో సాధించిన ఫలితాలకు సంబంధించిన ప్రకటనలను ఆయా సంస్థల కార్యదర్శులు సోమవారం మీడియాకు విడుదల చేశారు.
Vasuki Indicus: ప్రపంచంలోనే అతిపెద్ద పాము వెలుగులోకి.. ఇది ఉన్నది ఎక్కడో తెలుసా?!
బీసీ గురుకులాలు భళా
బీసీ గురుకుల విద్యార్థులు 98.43శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ఆ సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. 97 బీసీ గురుకులాలకు చెందిన 5,354 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 5,270 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 56 గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే 90 శాతం గురుకులాలు మెరుగైన ఫలితాలు సాధించాయన్నారు. గతేడాదికి కంటే 8.4 శాతం అత్యధిక ఉత్తీర్ణత సాధించడం విశేషం. సత్యసాయి జిల్లా గుడిబండ గురుకులానికి చెందిన గోసుల గోపిక 596 మార్కులతో మొదటి స్థానం, తిరుపతి జిల్లా దోరవారిసత్రం గురుకులానికి చెందిన కె.పాంచజన్య 595 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు.
Admissions in MSME Hyderabad: ఎంఎస్‌ఎంఈలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
అంబేడ్కర్ గురుకులాల్లో 94.56 శాతం ఉత్తీర్ణత
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 94.56శాతం ఉత్తీర్ణత సాధించినట్టు సంస్థ కార్యదర్శి ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. 13,761 మంది విద్యార్థుల్లో 13,012 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 185 గురుకులాల్లో 42 గురుకులాలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. మదనపల్లి బాలికల గురుకులానికి చెందిన ఎం.ధోనికా 594 మార్కులతో మొదటి స్థానంలో, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కె.తులసి 589 మార్కులతో ద్వితీయ స్థానంలో, బాపట్ల జిల్లా నర్సాయపాలెం గురుకులానికి చెందిన ఎ.హారిక 587 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్టు మహేశ్‌కుమార్ తెలిపారు.
UPSC CMS 2024 Notification: 827 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రాత పరీక్షలో రాణించే మార్గాలు ఇవే..
గిరిజన గురుకులాల్లో 89.91 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల (ఏపీటీడబ్ల్యూఐఎస్)కు చెందిన విద్యార్థులు పదో తరగతిలో 89.91 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు గురుకులాల సంస్థ కార్యదర్శి సదా భార్గవి తెలిపారు. మొత్తం 5,046 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 4,537 మంది ఉత్తీర్ణత సాధించారు. గిరిజన గురుకులాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిలో సత్యసాయి జిల్లా తనకల్లు బాలికల గురుకులానికి చెందిన బి.తులసి 589 మార్కులు, పార్వతిపురం మన్యం జిల్లా జోగంపేట బాలుర గురుకులానికి చెందిన కె.అఖిల్‌అభిరామ్ 580 మార్కులతో మొదటి, రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 128 గురుకులాల్లో 27 గురుకులాలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
విభిన్న ప్రతిభావంతులు 100 శాతం ఉత్తీర్ణత
ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ఆ శాఖ సంచాలకులు బి.రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. బాపట్ల, ఒంగోలు, విశాఖ, హిందూపురంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో 58 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా వారిలో 20 మంది అంధ విద్యార్థులు, 38 మంది బదిరులున్నారు. వీరు ప్రత్యేక బోధన పద్ధతుల(బ్రెయిలీ, సాకేంతిక భాష) ద్వారా విద్యనభ్యసించినట్టు తెలిపారు. ప్రత్యేక అధ్యాపకుల ప్రత్యేక శ్రద్ధ, బోధన ద్వారా ఉత్తమ ఫలితాలు సాధ్యమైనట్టు రవిప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు.
గురుకులాల్లో టెన్త్ ఫలితాలపై గెస్ట్ టీచర్స్ హర్షం
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అద్భుత ఫలితాలు సాధించడంపై ఏపీ గెస్ట్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడు టి.దాసు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పదవ తరగతిలో బీసీ గురుకులాల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇందుకు కృషి చేసిన బీసీ గురుకులాల కార్యదర్శి కృష్ణమోహన్‌కు, వాటిలో పనిచేస్తున్న 1,253 మంది గెస్ట్ టీచర్లకు దాసు అభినందనలు తెలిపారు. ఇంతటి మంచి ఫలితాలు రావడానికి దోహదం చేసిన గెస్ట్ టీచర్స్‌ను కాంట్రాక్ట్ టీచర్స్‌గా రెగ్యులర్ చేయాలని దాసు విజ్ఞప్తి చేశారు.
Tags
- Gurukul schools
- Tenth Class Students
- top scorers
- dr br ambedkar gurukul school
- govt gurukul school
- Tenth Class Results
- ap tenth results 2024
- ap tenth students
- Education News
- Sakshi Education News
- amaravathi news
- Amaravati
- gurukulam
- BoardExams
- Students
- achievement
- Results
- Success
- Education
- Schools of Excellence
- sakshieducation