Skip to main content

Fee Reimbursement: జగనన్న విద్యాదీవెనతో నంద్యాల జిల్లాలో 31,494 మంది తల్లుల ఖాతాల్లో రూ.24.52 కోట్లు!

నంద్యాల: విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు జగనన్న విద్యాదీవెన పథకం ఎంతో భరోసా ఇస్తుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 31,494 మంది తల్లుల ఖాతాల్లో రూ.24.52 కోట్లు జమ.
JVV-Nandyala-Dist

సోమవారం జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలో మూడో విడత 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రూ. 24.52 కోట్లు జమ అయ్యాయి. సోమవారం చిత్తూరు జిల్లా నగరి బహిరంగ వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నిధులు నేరుగా జమ చేశారు.

NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

ఈ కార్యక్రమాన్ని నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ మనజిర్‌ జిలానీ శామూన్‌, జెడ్పీ చైర్మన్‌ ఎరబ్రోతుల పాపిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా, సంక్షేమ శాఖ డీడీ చింతామణి, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా ఎరబ్రోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో సీఎం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.

జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రూ.24.52 కోట్లు జమ చేశామన్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 5,981 మంది విద్యార్థుల తల్లులకు రూ.4.16 కోట్లు, బనగానపల్లెలో 6,238 మంది విద్యార్థుల తల్లులకు రూ.4.36 కోట్లు, డోన్‌లో 5,002 మంది విద్యార్థుల తల్లులకు రూ.3.39 కోట్లు, నందికొట్కూరులో 5,316 మంది విద్యార్థుల తల్లులకు రూ.3.54 కోట్లు, నంద్యాలలో 5,896 మంది విద్యార్థుల తల్లులకు రూ.4.60 కోట్లు, పాణ్యంలో 1,803 మంది విద్యార్థుల తల్లులకు రూ.1.29 కోట్లు, శ్రీశైలంలో 4,643 మంది విద్యార్థుల తల్లులకు రూ. 3.14 కోట్లు మొత్తం 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రూ.24.52 కోట్లు నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారన్నారు.

 

APPSC Group1 Ranker 2022 Success Story : Group-1 ఉద్యోగం కొట్టా..| నా స‌క్సెస్ ప్లాన్ ఇదే..

మైనార్టీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యా రంగానికి పెద్దపీట వేసి పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, జెడ్పీ చైర్మన్‌, అధికారులు చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్‌ సునితఅమృతరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Published date : 29 Aug 2023 05:29PM

Photo Stories