Distribution of tabs: దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ
చోడవరం రూరల్: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, వారికి ఉచితంగా ట్యాబ్‌లను అందచేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిదే అని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కొనియాడారు. సాధారణ విద్యార్థులకే గాకుండా ఫిజికల్లీ ఛాలెంజెడ్ విద్యార్థులకు సైతం ట్యాబ్‌లను అందచేయడం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి, దివ్యాంగ విద్యార్థులకు శ్రేయస్సుకు తీసుకుంటున్న శ్రద్ధలకు తార్కాణమని పేర్కొన్నారు. నవంబర్ 7న సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రాంగణంలోని సహిత విద్యా వనరుల కేంద్రం (భవిత)లో జిల్లా స్థాయి దివ్యాంగ విద్యార్థుల (వినికిడి లోపం, దృష్టిలోపం)కు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధర్మశ్రీ విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్న దివ్యాంగ విద్యార్థులు సులభంగా విద్యాభ్యాసం చేయడానికి వీలుగా 33 యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి డిజిటల్ విద్యను అందచేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట వేసిన సంగతి గుర్తు చేశారు. జిల్లా సహిత విద్యా సమన్వయాధికారిణి శకుంతల మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో 165 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా కార్యక్రమంలో భాగంగా సహిత విద్యా విభాగం ద్వారా ట్యాబ్‌ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని సహిత కేంద్రాల ఐఈఆర్‌పీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ట్యాబ్‌లకు అర్హులైన విద్యార్థులను వాటి వినియోగానికి కార్యోన్ముఖులను చేసారని అన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జయలక్ష్మి, ఎంపీపీ గాడి కాసులమ్మ, చోడవరం గ్రామ సర్పంచ్ బి.శ్రీను, జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామిరెడ్డి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ డి.కుమారి, విద్యార్థుల తల్లిదండ్రులు, సహిత కేంద్రాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags
- Distribution of tabs
- distribution of tabs for students
- Students
- YS JaganMohan Reddy
- AP Govt Schools
- AP Government Schools Nadu Nedu
- Education News
- andhra pradesh news
- FreeTablets
- PhysicallyChallengedStudents
- EducationDevelopment
- GovernmentInitiatives
- SchoolDigitalLearning
- Sakshi Education Latest News