Skip to main content

Degree Admissions 2023: డిగ్రీ ప్రవేశాలకు వేళాయె

Degree Admissions 2023

అనంతపురం: 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 24 వరకూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 26 నుంచి 30 వరకూ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. జులై 3న సీట్ల కేటాయింపు, 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎస్కేయూ పరిధిలో 86 డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ అడ్మిషన్లు కల్పించనున్నారు.


రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు..
గతంలో డిగ్రీ అడ్మిషన్లు ప్రతిభ ఆధారంగా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వారీగా ఉండేవి కాదు. నాణ్యత ప్రమాణాలు గల కళాశాలలో సీటు దక్కాలంటే కష్టసాధ్యమయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి డిగ్రీ అడ్మిషన్లలోనూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంటర్‌ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించే పద్ధతికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతిభ ఆధారంగా సీట్లు దక్కుతున్నాయి.

చ‌ద‌వండి: Navodaya Vidyalaya Samiti: నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌


ఆనర్స్‌ డిగ్రీ విధానం..
నాన్‌ ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లోనూ ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ఆనర్స్‌ విధానం అమల్లోకి వచ్చింది. మూడు సంవత్సరాల డిగ్రీ చాలు అనుకుంటే ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఇచ్చుకోవచ్చు. నాలుగో సంవత్సరం చదివితే ఆనర్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ పీజీ కోర్సును అందుబాటులోకి తెచ్చారు.

Published date : 23 Jun 2023 06:53PM

Photo Stories