Skip to main content

Dr. BR Ambedkar University: నేటి నుంచి డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు

Degree 3rd sem exams from today

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఐదో తేదీ నుంచే జరగాల్సి ఉండగా మిచాంగ్‌ తుఫాన్‌ వల్ల ఐదు, ఆరో తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. 5న జరగాల్సిన పరీక్ష ఈ నెల 21కి, ఆరున జరగాల్సిన పరీక్ష 22వ తేదీకి రీషెడ్యూల్‌ చేసినట్లు ఎగ్జామినేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎస్‌.ఉదయ్‌భాస్కర్‌ చెప్పారు. 99 కళాశాలల నుంచి రెగ్యులర్‌, సప్లిమెంటరీగా 10481 మంది హాజరవుతారన్నారు.

☛ DEO: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

Published date : 07 Dec 2023 04:53PM

Photo Stories