Skip to main content

DEO: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

Students should be taught in a way that they can understand

త్రిపురారం : విధ్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తూ.. వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని డీఈఓ భిక్షపతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం త్రిపురారం మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. సమగ్ర శిక్షణ ద్వారా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌ను ప్రతి ఉపాధ్యాయుడు డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థి వారీగా ప్రారంభ పరీక్ష గ్రేడ్‌లు అప్‌లోడ్‌ చేసి ప్రతి నెలా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ప్రగతిని యాప్‌లో నమోదు చేయాలన్నారు. బోధన విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో త్రిపురారం మండల ఎంఈఓ బాలాజీ నాయక్‌, నోడల్‌ అధికారి రవి, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు కర్నాటి వెంకటేశ్వర్లు, రిసోర్స్‌ పర్సన్‌లు చిర్ర మల్లయ్య, మధుమోహన్‌, మధుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

☛ Students: విద్యార్థుల ప్రగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Published date : 07 Dec 2023 04:50PM

Photo Stories