Skip to main content

Telangana schools Holiday : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు లేదు.. కారణం ఇదే..

సాధారణంగా రెండో శనివారం రోజు తెలంగాణ‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. కానీ.. ఈ న‌వంబ‌ర్ నెలలోని రెండో శనివారంలో మాత్రం సెలవును రద్దు చేశారు.

అయితే.. అయితే ఈ సెలవు రాష్ట్రం మొత్తం కాదు.హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు న‌వంబ‌ర్ 12వ తేదీన పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Schools Holidays : స్కూల్స్‌, కాలేజీలు బంద్‌.. కార‌ణం ఇదే !

ఎందుకంటే.. 
సెప్టెంబర్ 9వ తేదీన‌ గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించిన విష‌యం తెల్సిందే. అందుకు బదులుగా న‌వంబ‌ర్ 12వ తేదీన సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు.

Published date : 11 Nov 2022 05:22PM

Photo Stories