Children's Festival: విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయాలి..
సాక్షి ఎడ్యుకేషన్: స్థానిక ఆర్ట్స్ కళాశాల ఎగ్జిబిషన్ మైదానంలో రెండో రోజు మంగళవారం కూడా బాలోత్సవం సందడిగా సాగింది. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలోత్సవం కమిటీ చైర్మన్ షమీం షఫీవుల్లా మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిన్నారుల్లో ఒత్తిడి తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు, ఏడీ కృష్ణయ్య, సూపరింటెండెంట్ ఆదినారాయణ, బాలోత్సవం కమిటీ ప్రతినిధులు సావిత్రి, శ్రీనివాసరావు, లింగమయ్య చేతులమీదుగా బహుమతులు అందజేశారు.
Good News for Women: మహిళలకు గుడ్‌న్యూస్ అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
రాష్ట్రపతి అవార్డు అందుకున్న బిసాతి భరత్, జయమారుతి, జీవన్‌కుమార్, కటకం కృష్ణవేణిని సత్కరించారు. ఎల్కే పీ కార్యదర్శి పద్మజ, విజయ్‌సాయికుమార్ పిల్లలకు భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా కత్తి విజయ్‌కుమార్, గాజుల వెంకట సుబ్బయ్య, రియాజుద్దీన్, సాధుశేఖర్, నాగేంద్ర, వన్నూరు మాస్టర్ వ్యవహరించారు.