Andhra University: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్‌లో ఏయూకు అత్యుత్తమ స్థానం
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఉన్నత విద్యకు దిక్సూచిగా, విద్యా రంగానికి మార్గదర్శిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలుస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం విజయవాడలో ఉన్నత విద్యశాఖ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో కేంద్ర విద్య శాఖ ప్రకటించే ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాకింగ్‌లో రాష్ట్రంలోనే ఏయూ నాలుగు విభాగాల్లో అత్యుత్తమ స్థానాల్లో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
BSc Food Sciences: సబ్జెక్టు టాపర్‌గా ఐశ్వర్య
ఓవరాల్ విభాగంలో ఏయూ, కళాశాలల విభాగంలో ఫార్మసీ, ఇంజినీరింగ్ కళాశాలలు, స్టార్టప్ ఇంక్యుబేషన్ రంగాల్లో ఆ హబ్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. నాలుగు జ్ఞాపికలను అందజేశారు. రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ ఈ జ్ఞాపికలను స్వీకరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.
TGT To PGT: మోడల్ స్కూళ్లలో పదోన్నతల జాబితా
ఏయూ రిజిస్ట్రార్‌కు సీఐడీ చీఫ్ అభినందన
ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్‌ని రాష్ట్ర క్రైం ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) చీఫ్ ఎన్.సంజయ్ అభినందించారు. మంగళవారం అమరావతిలోని తన కార్యాలయంలో స్టీఫెన్‌ను సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు. పరిపాలన దక్షత, ఉన్నత విద్యార్హతలు కలిగిన ఆచార్య స్టీఫెన్‌కు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏయూ పూర్వ విద్యార్థిగా తాను ఎల్లప్పుడూ విశ్వవిద్యాలయం ప్రగతిని తెలుసుకుంటున్నానని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.