Skip to main content

Admissions in APR Schools and Junior Colleges: 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీల భర్తీ, జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలు..

admissions in Minority APR Schools and Junior Colleges

వెంకటగిరి రూరల్‌ : ఆంధ్రప్రదేశ్‌ గురుకుల సాధారణ పాఠశాల, ఏపీఆర్‌ఎస్‌ జూనియర్‌, డిగ్రీ బాలుర కళాశాలల్లో ప్రవేశం కోసం ఆన్‌లైలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెంకటగిరి ఏపీఆర్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌, జిల్లా కో–ఆర్డినేటర్‌ చౌదరి శారదబాయ్‌ తెలిపారు. 2024–25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశం, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీ, జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం దరఖాస్తుల పక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని, ఈనెల 25వ తేదీన ప్రవేశ పరీక్షలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా మైనారిటీ గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతుల్లో ఖాళీల భర్తీ, జూనియర్‌ కళాశాల (బాలుర విభాగం)లో ప్రవేశం కోసం రాత పరీక్షలు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

Published date : 05 Mar 2024 05:29PM

Photo Stories