Skip to main content

Free education in Private schools: ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

Free education in Private schools

తిరుపతి అర్బన్‌: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం అన్ని ప్రైవేటు, ఎయిడెట్‌ స్కూల్స్‌లో 25 శాతం సీట్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలని డీఈఓ వీ.శేఖర్‌ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మాట్లాడుతూ 2024–25 సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో చేరనున్న బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు, దివ్యాంగుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4శాతం, బీసీ, మైనారిటీ, పేదలైన ఓసీలకు 6శాతం సీట్లు కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. అయితే 2018 ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 2019 మార్చి వరకు జన్మించిన పిల్లలు ఒకటో తరగతిలో చేర్చడానికి అర్హులన్నారు. వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్న పిల్లల కుటుంబాలకు వార్షిక ఆదాయం రూ.1,20,000, పట్టణ ప్రాంతాల పిల్లలకు రూ.1,40,000 మించకుండా ఉండాలన్నారు. ఆ సచివాలయం, మండల విద్యాశాఖ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ నుంచి 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నమోదు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం టోల్‌ ఫ్రీ, హెల్ప్‌లైన్‌ నం.14417లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Published date : 05 Mar 2024 05:30PM

Photo Stories