Skip to main content

Btech Seats: ఎస్‌టీ విద్యార్థుల‌కు సీట్ల‌ను పెంచిన తెలంగాణ... ఈ ఏడాది నుంచే అమ‌లు

తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్టీ విద్యార్థుల‌కు శుభ‌వార్త అందించింది. ఈ ఏడాది చేప‌ట్ట‌నున్న ఇంజ‌నీరింగ్ అడ్మిష‌న్ల‌లో వారికి రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎస్టీల‌కు 6 శాతంగా ఉన్న రిజ‌ర్వేష‌న్ను మ‌రో 4 శాతం పెంచి 10 శాతం చేసింది. దీంతో గిరిజ‌న విద్యార్థుల‌కు భారీగా ల‌బ్ధి చేకూర‌నుంది.
Btech Seats
Btech Seats
students

ఈ విద్యా సంవత్సరం(2023-24)లో బీటెక్‌ సీట్ల భర్తీలో ఎస్‌టీలకు 10 శాతం సీట్లు కేటాయించనున్నారు. గిరిజనులకు ఇప్పటివరకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం గతేడాది 10 శాతానికి పెంచింది. ఈ మేర‌కు 2022 సెప్టెంబరు 30న జీవో జారీ చేసింది. అప్పటికే పాలిటెక్నిక్‌, ఎంసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ కావడంతో వాటిల్లో కొత్త రిజర్వేషన్‌ అమలు చేయలేదు. ఈసారి అమలు చేయనున్నారు. ఎస్‌టీలకు 4 శాతం పెంచినప్పుడు జనరల్‌ కేటగిరీలో తగ్గించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి నుంచి ఎస్సీలకు-15 శాతం, ఎస్‌టీలకు-10, బీసీలకు-29 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. 

చ‌ద‌వండి: అక్ర‌మ నియామ‌కాలు, ప‌దోన్న‌తులు రద్దు... పాత రిజిస్ట్రార్‌ జౌట్‌.. కొత్త‌గా యాద‌గిరికి ప‌గ్గాలు

Published date : 21 Apr 2023 01:38PM

Photo Stories