Skip to main content

NBE Fellowship: భారతీయ విద్యార్థులకు అందించే కోర్సులు, ఎంపిక విధానం, పరీక్ష వివరాలు ఇలా..

NBE Fellowship Entrance Test
NBE Fellowship Entrance Test

భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(ఎన్‌బీఈ).. మెడికల్‌ సైన్సెస్‌లో ఫెలోషిప్‌ ఎంట్రెన్స్‌టెస్ట్‌(ఎఫ్‌ఈటీ)కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఫెలో ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ షెలోషిప్‌ పరీక్ష జనవరి 11వ తేదీన జరుగనుంది. అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్‌ 13 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌బీఈ

వైద్యవిద్యలో నాణ్యతను పెంచే ఉద్దేశంతో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ విభిన్న విభాగాల్లో 54 పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ డాక్టోరల్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఎన్‌బీఈ అందించే డిగ్రీని డిప్లొమేట్‌ ఆఫ్‌ నేషనల్‌ బోర్డ్‌ అంటారు. భారతీయులకు ఎఫ్‌ఎన్‌బీ కింద ప్రవేశాలు కల్పిస్తారు. అంతర్జాతీయ విద్యార్థులకు ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ (ఎఫ్‌పీఐఎస్‌) కింద ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు

  • పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ /తత్సమాన)లో ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: అన్ని వయసుల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. 

అంతర్జాతీయ అభ్యర్థులు

  • అంతర్జాతీయ దరఖాస్తుదారులు తమ సొంత దేశంలో రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ అయి ఉండాలి. ఈ అభ్యర్థులు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ పొందాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అనంతరం మాత్రమే ఏదైన ఎఫ్‌ఎన్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అనుమతిస్తారు. భారత దేశంలో ప్రాక్టీస్‌కు అనుమతి పొందాలంటే.. అంతర్జాతీయ విద్యార్థులు సంబంధిత మెడికల్‌ కౌన్సిల్‌/ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ కూడా పొందాల్సి ఉంటుంది.
     

చ‌ద‌వండి: Summer Internship: ఆర్‌బీఐలో ఇంటర్న్‌షిప్‌.. రూ.20వేల స్టయిపండ్‌

ఫెలోషిప్‌

  • ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.41వేలు, రెండో ఏడాది నెలకు రూ.43వేలు ఫెలోషిప్‌ చెల్లిస్తారు. 

ఫెలోషిప్‌ కోర్సులు

  • భారతీయ విద్యార్థులకు అందించే ఫెలోషిప్‌ కోర్సులు: ఆర్థోప్లాస్టీ, బ్రేస్ట్‌ ఇమేజింగ్, హ్యాండ్‌ అండ్‌ మైక్రోసర్జరీ, ఇన్ఫెక్షన్స్, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ, లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్, మెటర్నల్‌ అండ్‌ ఫీటల్‌ మెడిసిన్, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, న్యూరో వాస్కులర్‌ ఇంటర్వెన్షన్, పీడియాట్రిక్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీడియాట్రిక్‌ నెఫ్రాలజీ, పీడియాట్రిక్‌.
  • అంతర్జాతీయ విద్యార్థులకు అందించే కోర్సులు: హ్యాండ్‌ అండ్‌ మైక్రోసర్జరీ, ఇన్ఫెక్షన్స్, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ, మెటర్నల్‌ అండ్‌ ఫీటల్‌ మెడిసిన్, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ హెమటో ఆంకాలజీ, రీప్రొడక్టివ్‌ మెడిసిన్, స్పైన్‌ సర్జరీ, విట్రియో రెటినాల్‌ సర్జరీ.

ఎంపిక విధానం

  • ఎంసీక్యూ బేస్డ్‌ టెస్ట్‌(ఫెలోషిప్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. 100 ప్రశ్నలకు 105 నిమిషాల కాలవ్యవధితో పరీక్షను నిర్వహిస్తారు.

పరీక్ష విధానం

  • ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో రెండు పార్ట్‌లుగా పరీక్షను నిర్వహిస్తారు. పార్ట్‌(ఎ)–45 నిమిషాలు, పార్ట్‌(బి)కి 60 నిమిషాల కాలవ్యవధితో పరీక్ష ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు. 
  • ఈ పరీక్షలో పార్ట్‌–ఎకు 40 శాతం వెయిటేజీ, పార్ట్‌– బికి 60శాతం వెయిటేజీ లభిస్తుంది.

సిలబస్‌

ఈ పరీక్షలో ఉండే రెండు పేపర్లకు సంబంధించి పార్ట్‌–ఎలో ఫీడర్‌ బ్రాడ్‌/సూపర్‌ స్పెషాలిటీ కోర్సు నుంచి ప్రశ్నలుంటాయి.అలాగే పార్ట్‌–బిలో సంబంధిత ఫెలోషిప్‌ కోర్సు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 13.12.2021
  • అడ్మిట్‌ కార్డ్‌: 04.01.2022
  • పరీక్ష తేదీ: 11.01.2022
  • ఫలితాల వెల్లడి: 31.01.2022
  • వెబ్‌సైట్‌: https://nbe.edu.in 


చ‌ద‌వండి: PhD Fellowships‌: ఈ కమిటీ సిఫార్సులు అమలైతే.. ఫెలోషిప్స్ అందని ద్రాక్షే!

Published date : 13 Dec 2021 06:19PM

Photo Stories