Skip to main content

National Science Day: స‌ర్ సీవీ రామ‌న్ దేశానికి గ‌ర్వ‌కార‌ణం

వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అలాగే ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న శాస్త్ర‌వేత్త స‌ర్ సీవీ రామ‌న్ అని ప్రిన్సిపాల్ డా. అలివేలు మంగమ్మ పేర్కొన్నారు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన ఘ‌న‌త‌ రామన్ కు ద‌క్కుతుంద‌న్నారు.
Science Day

ఆయ‌న పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని జాతీయ సైన్స్ దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం దేశ ప్ర‌జ‌ల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు. నేష‌న‌ల్ సైన్స్ డే సంద‌ర్భంగా కూక‌ట్‌ప‌ల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్‌డే ఉత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్‌లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవని, రామ‌న్ ఈ సంప్ర‌దాయాన్ని తిర‌గ‌రాశార‌న్నారు. రామన్ ఈ గడ్డపైనే చదువుకుని, తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్‌లో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్‌కు నోబెల్ సాధించిపెట్టారన్నారు. విద్యార్థులంతా శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో దేశాన్ని అగ్ర‌గామిగా నిల‌పాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. భవాని, భౌతిక శాస్త్ర విభాగాధిపతి, డా.ఎం. కొండయ్య, అధ్యాపకులు  డా.ఎన్. విజయలక్ష్మీ, డా. దయానంద్ ఆర్య, డా. రమేష్ బాబు, డా. సుజాత, సౌజన్య, రాజు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: మ‌రోసారి నంబ‌ర్ 1 స్థానానికి చేరుకున్న మ‌స్క్‌

చ‌ద‌వండి:  18 ఏళ్ల వ‌ర‌కు చ‌ద‌వ‌డం, రాయ‌డం రాదు... కానీ, ప్రొఫెస‌ర్ అయ్యాడిలా 

Published date : 28 Feb 2023 05:23PM

Photo Stories