Skip to main content

Elon Musk: మ‌రోసారి నంబ‌ర్ 1 స్థానానికి చేరుకున్న మ‌స్క్‌... అదానీ స్థానం ఎక్క‌డో తెలుసా..?

ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ మరోసారి అగ్రస్థానానికి చేరారు. బ్లూమ్‌బెర్గ్‌ సూచీ ప్రకారం సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్ ఆస్తుల విలువ సుమారు 187 బిలియన్‌ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టేసినట్లైంది.
elon musk

ప్రస్తుతం ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ 185 బిలియన్‌ డాలర్లుగా ఉంది. తాజాగా టెస్లా షేర్ల విలువ పెరగడంతో మస్క్‌ మరోసారి ఈ సూచీలో అత్యున్నత స్థానానికి చేరారు.

చ‌ద‌వండి: అదానీకి ఆర్బీఐ షాక్‌... వివరాలు తమకు అందజేయాలంటూ​​​​​​​....
భారీగా ప‌డిన టెస్లా షేర్లు..!
గతేడాది నవంబర్‌-డిసెంబర్‌ మధ్యలో టెస్లా అధిపతి మస్క్‌ ఆస్తుల విలువ ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు పతనమైంది. ఈ క్రమంలో చరిత్రలో అత్యంత భారీగా సంపదను కోల్పోయిన వ్యక్తిగా రికార్డు సృష్టించినట్లు ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’  కూడా ప్రకటించింది. 2021లో నవంబర్లో 340 బిలియన్‌ డాలర్లున్న ఆస్తులు గతేడాది చివర్లో దాదాపు 137 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దీంతో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుడి స్థానం దక్కించుకున్నారు.
44 బిలియన్‌ డాలర్లతో ట్విట‌ర్ కొనుగోలు
మస్క్‌ కంపెనీ టెస్లా షేర్లు కొవిడ్‌, చైనా లాక్‌డౌన్ల కారణంగా 65 శాతం విలువ కోల్పోయాయి. 2022 సంవత్సరం టెస్లాకు అత్యంత దారుణంగా గడిచిందని నిపుణులు చెబుతారు. ఆ కంపెనీ దాదాపు 700 బిలియన్‌ డాలర్లు కోల్పోయింది. అయితే మస్క్‌ గతేడాది ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. త‌ర్వాత‌ వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా దాదాపు 50 శాతం మందికిపైగా ఉద్యోగులను ట్విట‌ర్ నుంచి తొలగించారు.

చ‌ద‌వండి:​​​​​​​ ‘స్టాక్‌ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
32వ స్థానానికి అదానీ..!
ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ  84.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.  మరోవైపు ఒకప్పుడు ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న స్థానంలో ఉన్న‌ అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 37.7 బిలియన్ డాలర్ల సంపదతో ఈ సూచీలో 32వ  స్థానానికి పడిపోయాడు. అమెరికా షార్ట్‌ సెల్లర్‌  హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూపు షేర్లన్నీ భారీ నష్టాలను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే.

Published date : 28 Feb 2023 03:27PM

Photo Stories