Battery Charge: సెకన్లలో రీచార్జ్ అయ్యే సోడియం బ్యాటరీ అభివృద్ధి..
Sakshi Education
సాంకేతిక ఆవిష్కరణలో ఇదొక పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు..
సాక్షి ఎడ్యుకేషన్: సెకన్లలోనే రీచార్జ్ చేయగల, అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాంకేతిక ఆవిష్కరణలో ఇదొక పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు. సోడియం అయాన్ హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ సెల్స్ తయారీపై సైంటిస్టులు దృష్టిసారించారు.
LSAM 20: ఎల్ఎస్ఏఎం బార్జ్‌ను ప్రారంభించిన భారత నౌకాదళం.. 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో అధిక శక్తితో కూడిన ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ పరికరాలకు ప్రస్తుతం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. లిథియం అయాన్ బ్యాటరీలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాల్ని పేర్కొంటూ ‘జర్నల్ ఎనెర్జీ స్టోరేజ్ మెటీరియల్స్’ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.
Published date : 30 Apr 2024 04:47PM