Ronald Rose: శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశాన్ని ప్రథమస్థానంలో నిలపాలి
ప్రపంచంలో అధిక జనాభా దేశంగా భారతదేశం ఆవిర్భవించిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి, ప్రపంచానికి అందించిన ఘనత మనకేదక్కుతుందన్నారు. ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో మహేంద్ర హిల్స్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల కాన్హా శాంతి వనంలో రసాయన శాస్త్ర సాంకేతికత సుస్థిర అభివృద్ధి – అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. శాస్త్ర, సాంకేతికతలో జరుగుతున్న అభివృద్ధిని అందుపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు చేస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని రోస్ విద్యార్థులకు సూచించారు.
చదవండి: పేద విద్యార్థుల జీవితాల్లో.. స్ఫూర్తి ప్రదాత కలెక్టర్ రొనాల్డ్ రాస్
అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించి, పర్యావరణానికి హానిచేయని హరిత రసాయన శాస్త్రాన్ని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ శాస్త్ర సాంకేతిక విభాగ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, హనుమంత్ నాయక్, అనురాగ్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, హెచ్‌సీయూ వీసీ ప్రొఫెసర్ బీ జగదీశ్వర్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిరూప తదితరులు పాల్గొన్నారు.
చదవండి: విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలి... రోనాల్డ్ రోస్