పేదవిద్యార్థుల జీవితాల్లో..స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కలెక్టర్ రొనాల్డ్ రాస్
Sakshi Education
సాక్షి, మహబూబ్‌నగర్: రాజు తలచుకుంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు. అదే చేసి చూపించారు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్.
కలెక్టర్‌గా తన విధులను నిర్వర్తిస్తూనే నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటికి నిధులు కేటాయించారు. తద్వారా విద్యారంగంలో పాలమూరు జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు,కస్తూర్బాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యనందించేందుకు మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ ఎంతో కృషి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలతోపాటు విద్యార్థుల అవసరాలు, ఉపయోగాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రయోగాలకు రాష్ట్రస్థాయిలో సైతం మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పథకాలు బ్రైటర్ మైండ్‌స, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఎడ్యుకేషన్ కలెక్టివ్, వాయిస్ ఫర్ గర్‌ల్స, జాలీ ఫోనిక్స్, స్వచ్ఛ భారత్- స్వచ్ఛ విద్యాలయ, మౌంటినీరింగ్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెండచంతో పాటు, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను సైతం బయటికి తీసుకువచ్చేందుకు ఎంతో తోడ్పాటునందించాయి. మిగతా శాఖల కంటే కూడా విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకువచ్చేందుకు కలెక్టర్ రొనాల్డ్ తీసుకున్న చర్యలు జిల్లాలో విద్యారంగంపై తనదైన ముద్రవేశాయి. బ్రైటర్ మైండ్‌సలో శిక్షణ తీసుకుంటున్న కస్తూ ర్బా విద్యార్థులు కలెక్టర్ రొనాల్డ్ జిల్లాలోని కస్తూర్బాల్లో చదువుతున్న విద్యార్థులకు బ్రైటర్ మైండ్‌స కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కళ్లకు గంతలు కట్టుకుని వస్తువుల రంగులు, ఆకారాలు, పుస్తకంలోని బొమ్మల ను చదవగల సామర్థ్యం పెంపునకుదోహదపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా కస్తూర్బాల్లో 2,500 మంది, పాఠశాలల్లో 2,520 విద్యార్థులు లబ్ధిపొందారు. ఇందుకోసం రూ.55 లక్షలు ఖర్చుచేశారు. వాయిస్ ఫర్ గరల్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమను తాము సమాజాన్ని అర్థం చేసుకోవడం, శారీరక మార్పులు, పరిశుభ్రత, లైఫ్ స్కిల్స్, ఆత్మస్థైర్యం పెంపుదల వంటి అంశాలను నేర్పిస్తారు. మొత్తం 4,700 మంది విద్యార్థులకు రూ.7.47 లక్షలు వెచ్చించారు. గురుకులాల్లోనూ ఇదే కార్యక్రమం కోసం రూ.4 లక్షలు కేటాయించారు.
ఇండియన్ ఎడ్యుకేషన్ కలెక్టివ్ పథకం ద్వారా 11 మండలాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమానికి రూ.44 లక్షలు మంజూరు చేశారు. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థినుల్లో గణితంలో నైపుణ్యాలు పెంచేం దుకు వేదిక్ మ్యాథ్స్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కస్తూ ర్బాల్లో 4,500 మంది, పాఠశాలల్లో 2,500ల మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సంవత్సరం మరో 5 వేల మందికి కొనసాగుతుంది. ఇందుకోసం రూ.12.60 లక్షలు ఖర్చుచేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ నైపుణ్యాలు పెంచేందుకు రూ.17.45 లక్షలు వెచ్చించారు. వీటిలోనే శిక్షణ కోసం రూ.12.37 లక్షలు చెల్లించారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు రూ.1.66 కోట్లు కేటాయించారు. జిల్లాలోని 5కేజీబీవీల్లో స్పొర్‌ట్స అకాడమీ ఏర్పాటుకు రూ.3.52 లక్షలు, విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు సంబంధించిన శిక్షణ కోసం రూ.3.60లక్షలు ఇచ్చారు. నీటిశుద్ధి యంత్రాల కోసం ఒక్కో కస్తూర్బాకు రూ.12 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలు వెచ్చించారు.
పదో తరగతిలో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు మాల్టీగ్రేయిన్ బిస్కెట్ల పంపిణీ రూ.53 లక్షలు అందించారు. మౌంటినీరింగ్ కార్యక్రమానికి రూ.15 లక్షలు ఇచ్చారు. స్పెషల్ విద్యావలంటీర్ల ఏర్పాటుకు రూ.7.20 లక్షలు, యువనేస్తం కార్యక్రమానికి రూ.5.20 లక్షలు వెచ్చించారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్- స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం ద్వారా పాఠశాలల బలోపేతానికి గ్రామీణుల్లో దాతల నుంచి రూ.1.10 కోట్లు సేకరించేందుకు విశేషంగా కృషి చేశారు. అలాగే ఇంటికి వంద.. బడికి చందా కార్యక్రమం ద్వారా పాలమూరుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు.

Published date : 05 Feb 2020 03:43PM