Skip to main content

APPSC Group 1 & 2 : 1000 పోస్టులు.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..? సిల‌బ‌స్, ప్రిలిమ్స్ ప‌రీక్ష మాత్రం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఛైర్మ‌న్ గౌత‌మ్ స‌వాంగ్ గుడ్‌న్యూస్ చెప్పారు.గ్రూప్‌-1లో 100 ఉద్యోగాలకు, గ్రూప్‌-2లో 900 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇస్తామ‌న్నారు. అలాగే ఈ గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల‌ నోటిఫికేష‌న్‌ల‌ను ఈ నెల (న‌వంబ‌ర్‌) చివ‌రిలోపు ఎప్పుడైన విడుద‌ల చేస్తామ‌న్నారు.

APPSC గ్రూప్‌-1&2 ప్రిలిమ్స్..

2024 ఫిబ్రవరిలో గ్రూప్‌-1&2 ప్రిలిమ్స్ నిర్వహింస్తామ‌న్నారు. ఈ పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. 2022 గ్రూప్-1 ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేసిన విష‌యం తెల్సిందే. ఈ సారి గ్రూప్‌-1 & 2 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను కూడా వేగ‌వంతంగా పూర్తి చేస్తామ‌న్నారు. గ్రూప్-2 సిలబస్ లో మార్పులు చేశామ‌న్నారు.

గ్రూప్‌-1 & 2 ప‌రీక్షావిధానంలో మార్పులు ఇవే :

యూపీఎస్సీ, మహారాష్ట్ర లాంటి వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్లని పరిశీలించిన తర్వాతే ఈ మార్పులు చేస్తున్నామ‌న్నారు. డిసెంబర్ నెలలో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఏపీపీఎస్సీ ఆద్వర్యంలో పరీక్షలు జ‌ర‌నున్నాయి. అలాగే జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామ‌న్నారు. ఏపీపీఎస్సీకి సంబంధం లేని పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినపుడు బడ్జెట్ మాత్రం ఆయా శాఖలు భరిస్తాయి. అలాగే కొన్ని పత్రికలు ఈ ఉద్యోగాల‌పై పూర్తిగా తప్పుడు కథ‌నాలు ప్రచురించాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఏపీలో నిరుద్యోగ అభ్యర్దులు గ్రూప్-1, గ్రూప్ 2 ఉద్యోగ‌ పరీక్షలకు కష్టపడి ప్రిపేర్ అవ్వాలని సూచిస్తున్నాను.

Photo Stories