Skip to main content

UPSC Exam 2023: యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

UPSC Recruitment Test 2023

మహారాణిపేట: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌–2023కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహనరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ నెల 7, 8 తేదీల్లో యూపీఎస్సీకి సంబంధించి కంబైన్డ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, మొత్తం 2,962 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని వెల్లడించారు. అభ్యర్థులు, రూట్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు యూపీఎస్సీ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని సూచించారు. అభ్యర్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి పంపించాలని చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షల నిర్వహణకు సహకరించాలని కోరారు. యూపీఎస్సీ పరిశీలకుడు ఎస్‌.హెచ్‌.రాహుల్‌ గార్గ్‌, పరీక్షల విభాగం సూపరింటెండెంట్‌ పాల్‌ కిరణ్‌, జీవీఎంసీ, పోలీస్‌, మెడికల్‌, ఈపీడీసీఎల్‌, లైజనింగ్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Jobs in Govt Degree College: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు

Published date : 06 Oct 2023 04:12PM

Photo Stories