UPSC: ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షలు తేదీ ఇదే.. పరీక్షల నిర్వహణ ఇలా..
వీటి నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.’’ అని డీఆర్‌ఓ గాయత్రిదేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ఒక పరీక్ష కేంద్రంలో సీడీఎస్ పరీక్షలు, మరో కేంద్రంలో ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షలు జరుగుతాయన్నారు.
మూడు సెషన్లుగా జరగనున్న సీడీఎస్ పరీక్షకు 101 మంది అభ్యర్థులు, రెండు సెషన్లుగా జరగనున్న ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు 83 మంది అభ్యర్థులు హాజరు అవుతారన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు రూట్ కమ్ లైజన్ అధికారులను, ఇద్దరు ఇన్‌స్పెక్టింగ్ అధికారులను నియమించామన్నారు. యూపీఎస్‌సీ నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.
చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే
పరీక్షల నిర్వహణ ఇలా...
- ● జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంగా సీడీఎస్ పరీక్ష పేపర్–1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు జరుగుతుంది. పేపర్–2 మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, పేపర్–3 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
- ● భైవర్‌నగర్‌లోని ఆర్‌టీఓ ఆఫీసు పక్కనున్న కేఎస్‌ఎన్ ప్రభుత్వ బాలికల యూజీ, పీజీ కళాశాల కేంద్రంగా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షకు సంబంధించి పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది.
అభ్యర్థులు ముందే చేరుకోవాలి
పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు నిర్ధేశించిన సమయానికి కంటే అరగంట ముందే చేరుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రంలోకి అనుమతించరు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైన గుర్తింపు కార్డు (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పాన్‌కార్డ్, తదిరాలు) తీసుకురావాలి.