UPSC Exam: ఈనెల 21న యూపీఎస్‌సీ పరీక్షలు.. అభ్యర్థుల సంఖ్య ఇంత..!
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 21న జరగనున్న యూపీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్ కుమార్ వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, లైజన్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో తపాలా శాఖ పర్యవేక్షకుడు గజేంద్ర కుమార్‌తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 21న ఆదివారం నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తోందన్నారు.
Counselling for Gurukul Admissions: గురుకులంలో 5వ తరగతి ప్రవేశానికి కౌన్సెలింగ్..
జిల్లా వ్యాప్తంగా 6,347 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 16 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం ఆరుగురు రూట్ అధికారులను, 16 మంది లైజన్ అధికారులను నియమించినట్లు చెప్పారు. ఇప్పటికే పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. అభ్యర్థులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని విభాగాల సిబ్బంది సహకరించాలని కోరారు.
Tags
- Combined Defense Services
- National Defense Academy
- UPSC
- Competitive Exams
- exam centers
- UPSC exam 2024
- number of candidates for UPSC 2024
- District Revenue Officer Mohan Kumar
- college principals
- Liaison officers
- Education News
- Sakshi Education News
- alluri seetaramaraju news
- UPSC updates
- UPSC Exams Dates
- Sunday exam conduct
- Candidate notification
- Exam scheduling
- Maharanipet UPSC exams