Telangana Government Jobs : త్వరలోనే 16,940 పోస్టుల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం.. డిసెంబర్‌లోనే వరుసగా..
బీఆర్‌కేఆర్ భవన్‌లో నవంబర్ 29వ తేదీన (మంగళవారం) ఉద్యోగ నియామకాలపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డితో కలసి ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీ ప్రక్రియ.. టీఎస్‌పీఎస్సీ, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర ఏజెన్సీల ద్వారా జరుగుతుందని తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
డిసెంబర్‌లోనే అన్ని పోస్టులకు..
సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించాలని కోరారు. దీని ఆధారంగా టీఎస్‌పీఎస్సీ వచ్చే నెల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు
ఈ నేపథ్యంలో ఆయా శాఖలతో ఇండెంట్ల కోసం వరుసగా సమావేశాలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇండెంట్లు అందిన తర్వాత రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా ? అని పరిశీలించి చూడనుంది. అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ల ప్రకటన ప్రారంభం కానుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.