Skip to main content

AMVI Jobs Notification 2022: ఏఎంవీఐ నోటిఫికేషన్ ఉపసంహరణ.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రవాణాశాఖలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) జూలై నెల‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే.
AMVI Jobs Notification 2022
TSPSC Withdrew Notification Assistant Motor Vehicle Inspector Jobs

కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ సెప్టెంబ‌ర్ 3వ తేదీన (శనివారం) ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

AEE Jobs Notification : 1540 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కూడా స్వీక‌రించింది. అలాగే మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ /డిప్లొమా(ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణతతో పాటు వాలిడ్‌ హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలనే నిబంధ‌న కూడా పెట్టింది. ఈ ఉద్యోగానికి 01.07.2022 నాటికి 21 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి అనే రూల్ కూడా పెట్టింది. ఈ ఉద్యోగానికి  ఎంపిక అయితే నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తామ‌ని నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించారు. అలాగే రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

ఈ నిబంధనపై నిరుద్యోగుల నుంచి..
నోటిఫికేషన్‌ వెలువడిన నాటికి అభ్యర్థులకు తప్పకుండా హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉండాలన్న నిబంధనపై నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. అర్హతలపై మరోమారు పరిశీలించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరడంతో నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించుకుంది.

TS Group-4 Jobs Notification : తెలంగాణలో గ్రూప్‌–4 నోటిఫికేషన్‌పై భ‌ర్తీపై మంత్రి హరీష్‌రావు ఇచ్చిన‌ క్లారిటీ ఇదే.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 05 Sep 2022 01:12PM
PDF

Photo Stories