Skip to main content

TS Group-4 Jobs Notification : తెలంగాణలో గ్రూప్‌–4 నోటిఫికేషన్‌పై భ‌ర్తీపై మంత్రి హరీష్‌రావు ఇచ్చిన‌ క్లారిటీ ఇదే.. నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : వారం రోజుల్లో 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తా మని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు

కొద్ది రోజుల్లోనే గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ కూడా వస్తుందని తెలిపారు. సెప్టెంబ‌ర్ 1వ తేదీన (గురువారం) ఆయన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్‌ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేష‌న్‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీఎస్‌పీఎస్సీ 9,168 గ్రూప్‌-4 పోస్టులను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది.

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

Government Jobs: ప్ర‌భుత్వ‌ ఉద్యోగాల‌కు కొత్త రోస్టర్ ఇదే.. ఈ మేర‌కే ఉద్యోగాల భ‌ర్తీ

కొత్త నిబంధనలు ఆధారంగానే..
రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇది వరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనలు ఆధారం కానున్నాయి.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

TSPSC Group-1 Syllabus: 503 పోస్టులు.. గ్రూప్‌–1 ప‌రీక్ష‌ల‌ సిల‌బ‌స్ ఇదే..

అత్యధికం పోస్టులు ఇవే..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌–4 ఉద్యోగాలను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్‌–4 కేటగిరీలో అత్యధికం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్‌ సర్వీస్‌ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరించింది.

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

గ్రూప్‌–4 సిల‌బ‌స్ ఇదే..

పేపర్-1 (మార్కులు 150)  :

Group4


➤ జనరల్ నాలెడ్జ్
➤ వర్తమాన వ్యవహారాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం
➤ పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
➤ భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు
➤ భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
➤ భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
➤ జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
➤ తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
➤ తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

పేపర్ -2 (మార్కులు 150) : 

Group 4 Exam Syllabus


☛ పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
☛ మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)
☛ లాజికల్ రీజనింగ్
☛ కాంప్రహెన్షన్
☛ రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్
☛ న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్

Group 1 & 2 : సిలబస్‌ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్‌ కుమార్‌ గ్రూప్‌–1 విజేత

Published date : 02 Sep 2022 08:19AM

Photo Stories