AEE Jobs Notification : 1540 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Telangana Government Jobs Notifications
ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వచ్చే అక్టోబర్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు శాలరీ రూ.54220-
133630 వరకు ఉంటుంది.