AE Jobs in Telangana : 704 ఏఈ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ.. అర్హతలు ఇవే..
ప్రభుత్వం దాదాపు 80వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారు మొదలుకొని.. డిగ్రీ, ఆపై చదువుకున్న వారిలో మెజారిటీ నిరుద్యోగుల దృష్టి ఈ ఉద్యోగాలపైనే ఉంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెకానికల్ (84), సివిల్ (320), అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (100), ఎలక్ట్రికల్ (200) విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆయా విభా గాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హుల వుతారు.ఇందులో 259 పోస్టులు మల్టీ జోన్–1కు, 445 పోస్టులు మల్టీ జోన్–2 కు కేటాయించారు. వీటితో పాటు మరో 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సివిల్ (182), మెకానికల్ (45) పోస్టులు ఉన్నాయి. 112 పోస్టులు మల్టీ జోన్–1కు, 115 పోస్టులు మల్టీజోన్–2 కు కేటాయించారు. బీటెక్ పట్టభద్రుల తో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Telangana: భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు.. ఇక్కడి నుంచి చదవాల్సిందే..
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
ఇటు విద్యుత్ శాఖలో మాత్రం..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) 1,271 పోస్టుల భర్తీకి మే 9న నోటిఫికేషన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో 70 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) నోటిఫికేషన్‌ను మే 11వ తేదీన విడుదల చేసింది. ఇంకా 201 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 1000 జూనియర్ లైన్ మెన్ (జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి. త్వరలోనే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్), తెలంగాణ జెన్ కో సంస్థల నుంచి సైతం ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్ కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.