Skip to main content

2,440 Jobs: సర్కారీ కొలువులుకు గ్రీన్‌సిగ్నల్‌

విద్య, పురావస్తు శాఖల్లో మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
2,440 Jobs
సర్కారీ కొలువులుకు గ్రీన్‌సిగ్నల్‌

ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జూలై 22న వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్‌ విద్య, కమిషనర్‌ ఆఫ్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖలో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత విభాగాలు పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటిని Telangana State Public Service Commission (TSPSC) ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది.

చదవండి:  Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

ఇంటర్‌ విద్యలో..

అరబిక్‌–02, వృక్షశాస్త్రం–113, వృక్షశాస్త్రం (ఉర్దూ)–15, రసాయన శాస్త్రం–113, కెమిస్ట్రీ (ఉర్దూ)–19, పౌరశాస్త్రం–56, పౌరశాస్త్రం (ఉర్దూ)–16, సివిక్స్‌ (మల్టీమీ­డి­యం)­–1, కామర్స్‌–50, కామర్స్‌ (ఉర్దూ)–7, ఎకనామిక్స్‌–81, ఎకనామిక్స్‌ (ఉర్దూ)­–15, ఇంగ్లిష్‌–153, ఫ్రెంచ్‌–2, హిందీ–117, హిస్టరీ–60, హిస్టరీ (ఉర్దూ)–12, హిస్టరీ/సివిక్స్‌–17, హిస్టరీ/సివిక్స్‌ (ఉర్దూ)–5, హిస్టరీ/సివిక్స్‌ (మల్టీమీ­డియం)–1, గణితం–154, గణితం (ఉర్దూ)–09, భౌతికశాస్త్రం–112, భౌతిక­శాస్త్రం (ఉర్దూ)–18, సంస్కృతం–10, తెలు­గు–60, ఉర్దూ–28, జంతుశాస్త్రం–128 జంతుశాస్త్రం (ఉర్దూ)–18 కలిపి 1,392 జూని­యర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. మరో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 

చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

సాంకేతిక విద్యలో 359 పోస్టులు..

సాంకేతిక విద్యలో 359 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌–4, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌–15, బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌–3, కెమికల్‌ ఇంజనీరింగ్‌–1, కెమిస్ట్రీ–8, సివిల్‌ ఇంజనీరింగ్‌–82, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌–24, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌–41, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌–1, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ–5, జియోలజీ–1, లెటర్‌ ప్రెస్‌–5, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 36, మెటలర్జీ–5, ప్యాకింగ్‌ టెక్నాలజీ–3, ఫార్మసీ–4, ఫిజిక్స్‌–5, ట్యానరీ–3, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ–1 పోస్టులు కలిపి 247 పోస్టుల్ని లెక్చరర్‌ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. ఇవికాక జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌–14, లైబ్రేరియన్‌–31, మ్యాట్రన్‌–5, ఫిజికల్‌ డైరెక్టర్‌–37, ఎలక్టీష్రియన్‌–25 పోస్టుల్నీ భర్తీ చేస్తారు. 

చదవండి: 10 TS Geography అంశాల నుండి 500+ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి

ఉన్నత విద్యలో..

కమిషనర్‌ ఆఫ్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌లో లెక్చర­ర్‌ విభాగంలో ఇంగ్లిష్‌–23, తెలుగు–27, ఉర్దూ–2, సంస్కృతం–5, స్టాటిస్టిక్స్‌–23, మెక్రోబయోలజీ–5, బయోటెక్నాలజీ–9 అప్లయ్‌డ్‌ న్యూట్రిషియన్‌–5, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌–311, బిజినెస్‌ అడ్మిని­స్ట్రేషన్‌–39, కామర్స్‌–బిజినెస్‌ అనలటిక్స్‌(స్పెషలైజేషన్‌)–8, డెయిరీ సైన్స్‌–8, క్రాప్‌ ప్రొడక్షన్‌–4, డేటా సైన్స్‌–12, ఫిషరీస్‌–3, కామర్స్‌–ఫారిన్‌ ట్రేడ్‌ (స్పెషలైజేషన్‌)–1, ఆర్కివ్స్, డిస్ట్రిక్ట్‌ గెజిటర్స్‌ విభాగంలో 6 రిసెర్చ్‌ అసిస్టెంట్‌ పోస్టులు కలిపి మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తారు. ఇవికాక లైబ్రేరియన్‌–24, ఫిజికల్‌ డైరెక్టర్‌–29 పోస్టులున్నాయి. పాలనాపరమైన అనుమతి లభించడంతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది.

చదవండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!

డైరెక్టర్‌ ఆఫ్‌ ఆర్కివ్స్‌లో 8 పోస్టులు..

డైరెక్టర్‌ స్టేట్‌ ఆర్కివ్స్‌ విభాగంలో 8 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆర్కివిస్ట్‌–2, అసిస్టెంట్‌ ఆర్కివిస్ట్‌–2, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌–1, జూనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌(ఉర్వూ, పర్షియన్‌)–1, రిసెర్చ్‌ అసిస్టెంట్‌–1, సీనియర్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ (ఉర్దూ, పర్షియన్‌)–1 పోస్టులున్నాయి. 

Published date : 23 Jul 2022 02:53PM

Photo Stories