Skip to main content

TS TET Results 2022 : జూన్ 27న‌ టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌..? రిజ‌ల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ టెట్‌ ఫ‌లితాల‌ను జూన్ 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు.
TS TET Results 2022
TS TET Results 2022

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. టెట్‌ పరీక్ష పేపర్‌–1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జ‌రిగింది. అలాగే పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జ‌రిగింది. ఈ ప‌రీక్ష‌కు 90 శాతం మంది హాజ‌రైన‌ట్టు క‌న్వీన‌ర్ తెలిపారు. టీఎస్ టెట్‌-2022 ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com )లో చూడొచ్చు.

టీఎస్ టెట్-2022 రిజ‌ల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

How to Check TS TET 2022 Results?

☛ Visit direct link available on sakshieducation.com

☛ Enter your hall ticket number and submit

☛ The results will be displayed on the screen

☛ Download a copy of the score card for further reference

ఈ సారి భారీగా..
టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్‌ పేపర్‌–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు. 32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్‌ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్‌–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు.

➤ TS TET 2022 Paper-1 Question Paper & Key (Click Here)

➤ TS TET 2022 Paper-2 Question Paper & Key (Click Here)

 ఈసారి పేపర్‌–2 రాసే వారు కూడా.. 
వాస్తవానికి డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసిన అభ్యర్థులు టెట్‌ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్‌–2 రాసే వారు కూడా పేపర్‌–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు.

AP TET 2022 : టెట్‌ను సులువుగా కొట్టే స‌రైన‌ మార్గాలు ఇవే..|బెస్ట్ బుక్స్ ఇవే..|సిల‌బ‌స్ ఇదే..

డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 25 Jun 2022 06:06PM

Photo Stories