Skip to main content

TS TET 2022 Paper-1 Key: తెలంగాణ టెట్ 'కీ' విడుద‌ల‌.. ఫ‌లితాలు విడుద‌ల మాత్రం ఈ తేదీనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పేప‌ర్-1 ప్రాథ‌మిక కీ ని క‌న్వీన‌ర్ రాధారెడ్డి జూన్ 15వ తేదీన‌(బుధ‌వారం) విడుద‌ల చేశారు.
TSTET 2022 Initial Key
TSTET 2022 Initial Key

ఈ ప్రాథ‌మిక కీ పై మీకు ఏమ‌న్నా అనుమానాలు ఉంటే https://tstet.cgg.gov.in//TSTETAPPL2022/#!/acceptObjections.htm ఈ లింక్ ద్వారా తెల‌ప‌వ‌చ్చును. టెట్ ప‌రీక్ష జూన్ 12వ తేదీన (ఆదివారం) జ‌రిగిన విష‌యం తెల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1ను ఉదయం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1కు 3,51,468 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. 3,18,506 (90.62శాతం) మంది హాజ‌ర‌య్యారు. అలాగే ఈ టెట్‌ ఫ‌లితాల‌ను జూన్ 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు క‌న్వీన‌ర్ చెప్పారు. తెలంగాణ టెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

TS TET 2022 Paper-1 Initial Key :

Published date : 15 Jun 2022 10:19PM
PDF

Photo Stories