TS Police Jobs: తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
శాఖల వారీగా ఈ ఉద్యోగాలను ఏయే సంస్థలు భర్తీ చేస్తాయో స్పష్టం చేస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మార్చి 23వ తేదీన (బుధవారం) ఉత్తర్వులు జారీ చేశారు. 80,039 ఉద్యోగాలకుగాను, తొలి విడతగా 30,453 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే..
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భర్తీకి అనుమతిచ్చిన వాటిలో అత్యధికంగా పోలీస్ ఉద్యోగాలే ఉన్నాయి. పోలీస్ విభాగానికి సంబంధించి 17,003 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
పోలీసు శాఖ:
➤ కానిస్టేబుల్ సివిల్ (4965),
➤ఆర్మడ్ రిజర్వ్(4423),
➤టీఎస్‌ఎస్‌పీ(5704),
➤కానిస్టేబుల్ ఐటీ అండ్ సీ(262),
➤డ్రైవర్లు పిటీవో(100),
➤మెకానిక్ పీటీవో(21), సీపీఎల్(100),
➤సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్(415),
➤ఎస్‌ఐ ఏఆర్(69),
➤ఎస్‌ఐ టీఎస్‌ఎస్‌పీ(23),
➤ఎస్‌ఐ ఐటీ అండ్ సీ(23),
➤ఎస్‌ఐ పీటీవో(3),
➤ఎస్‌ఐ ఎస్‌ఏఅర్ సీపీఎల్(5)
➤ఏఎస్‌ఐ(ఎఫ్‌బీబీ–8),
➤సైంటిఫిక్ ఆఫీసర్(ఎఫ్‌ఎస్‌ఎల్–14),
➤సైంటిఫిక్ అసిస్టెంట్(ఎఫ్‌ఎస్‌ఎల్–32),
➤ల్యాబ్‌టెక్నిషీయన్ (ఎఫ్‌ఎస్‌ఎల్–17),
➤ల్యాబ్ అటెండెంట్(1),
➤ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్స్(390),
➤ఎస్‌ఐ ఎస్‌పీఎఫ్(12)
మొత్తం: 16,587
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
డీజీపీ ఆఫీస్:
➤హెచ్‌ఓ (59),
➤జూనియర్ అసిస్టెంట్ ఎల్‌సీ(125),
➤జూనియర్ అసిస్టెంట్ టీఎస్‌ఎస్‌పీ(43),
➤సీనియర్ రిపోర్టర్(ఇంటెలిజెన్స్–2),
➤డీజీ ఎస్‌పీఎఫ్ (2)
మొత్తం: 231
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే
జైళ్ల శాఖ:
➤ డిప్యూటీ జైలర్ (8),
➤ వార్డర్ (136),
➤వార్డర్ ఉమెన్ (10)
మొత్తం: 154
Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..