మొక్కలు.. ఉపయోగాలు
Sakshi Education
అనాది కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు మానవునికి ఏదో విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మానవ మనుగడ మొత్తం మొక్కలపైనే ఆధారపడి ఉంది. ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించే కలప మొదలు.. అలంకరణ, వివిధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయారీ వరకు మొక్కలు వివిధ రూపాల్లో మానవునికి ఉపయోగపడుతున్నాయి.
జీవశాస్త్రం
మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయి. ఉదాహరణ ఔషధాలు, కలప, అలంకరణ వస్తువులు, నూనె, వనస్పతి మొదలైనవి.
వివిధ రూపాల్లో:
ప్రతి రోజు మనం తీసుకునే ఆహారం వివిధ రూపాల్లో మొక్కల నుంచి లభిస్తుంది. వీటిలో వరి, గోధుమ, జొన్న, సజ్జ, బార్లీ, మొక్క జొన్న వంటివి ధాన్యాలు. కంది, పెసర, మినుములు, శెనగ, అలసందాలు, బీన్స్ మొదలైనవి పప్పు ధాన్యాలు (ఇవి పోయేసి, లెగ్యూమినేసి మొక్కల నుంచి లభిస్తున్నాయి). అంతేకాకుండా వీటిలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బియ్యం గింజలపై ఉండే అల్యురాన్ పొరలో ఆ1 విటమిన్ అధికంగా ఉంటుంది. ఆధునిక జెనెటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా రూపొందించిన గోల్డెన్ రైస్‌లో విటమిన్-అ పుష్కలంగా లభిస్తుంది. పప్పు ధాన్యాలలో శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. దుంపలు, ఆకు కూరలు, కూరగాయలు, ఫలాలు వంటి ఆహార పదార్థాలు కూడా మొక్కల నుంచి లభిస్తున్నాయి. వీటిలో పోషక పదార్థాలు మెండుగా ఉంటాయి. ఉదాహరణకు దుంపలలో కార్బోహైడ్రేట్స్, ఆకు కూరలలో కాల్షియం, ఐరన్, ఎండు ఫలాల్లో ఫై వంటి పోషకాలు లభ్యమవుతాయి. చెరకులో అతి తీపిదనాన్ని కలిగిన ఫ్రక్టోస్, మామిడి, బొప్పాయి వంటి ఫలాల్లో విటమిన్-అ ఉంటుంది. సిట్రస్, ఉసిరి, జామ వంటి వాటిలో విటమిన్-ఇ అధికంగా ఉంటుంది. మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల ఫలాలు కూడా మొక్కల నుంచే లభిస్తున్నాయి.
ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఔషధ మొక్కల గురించి అధర్వణ వేదంలో కూడా ప్రస్తావించారు. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్న మొక్కలను పరిశీలిస్తే.. వేప నుంచి లభించే నింబిన్, నింబిడిన్ అనేవి చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయి. వేపను ‘హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా’ అంటారు.
పారిశ్రామికంగా కూడా మొక్కలు వివిధ రూపాల్లో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పేపర్ తయారీలో సైపరస్ పల్ప్ అనే మొక్కను వినియోగిస్తున్నారు. టేకు, మేఖేలియా వంటి వాటి నుంచి ఫ్లైవుడ్‌ను, పెన్సిల్ వంటి వాటిని జానిపెరస్ మొక్కల నుంచి తయారు చేస్తున్నారు. మల్బరి, డాల్‌బిర్జియా వంటి మొక్కల నుంచి హాకీ స్టిక్స్‌ను రూపొందిస్తున్నారు. బిలియర్డ్స్ క్యూస్ తయారీలో ఏసర్ వంటి మొక్కలు తోడ్పడుతున్నాయి. అదేవిధంగా సబ్బుల పరిశ్రమలో కానుగ, కాండిల్స్ తయారీలో మదుక (ఇప్ప), పాం ఆయిల్ కోసం ఇలేయిస్ వంటి మొక్కలను ఉపయోగిస్తున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త రకం మొక్కలను సృష్టిస్తున్నారు. ఇవి మానవ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు బీటీ కాటన్, గోల్డెన్ రైస్ వంటి మొక్కలు. అంతేకాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్, కణజాల వర్థనం వంటి పద్ధతుల్లో కూడా నూతన మొక్కలను రూపొందిస్తున్నారు. జూట్, గోగునార, ఆలొవీరా, కొబ్బరి వంటి మొక్కల నుంచి నారలు లభిస్తాయి. పత్తి నుంచి లభించే కేశాలలో సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుంది. పొంగామియా (కానుగ), జట్రోపా వంటి మొక్కల నుంచి బయో డీజిల్‌ను తయారు చేస్తారు.
కృత్రిమ పద్ధతుల ద్వారా

- ప్రకృతిలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. వర్షాలు కురవడానికి మొక్కలు ఎంతగానో తోడ్పడతాయి.
- ఇళ్ల నిర్మాణానికి వాడే కలప, ఫర్నీచర్, అలంకరణ వస్తువుల తయారీలో టేకు, మహాగని, వేప, తుమ్మ, రోజ్‌వుడ్ వంటి మొక్కల భాగాలను ఉపయోగిస్తారు. సంగీత వాయిద్యాలను రూపొందించడానికి ఎర్ర చందనం మొక్కలను వినియోగిస్తారు.
- అలంకరణ కోసం ఇంటి ముందు, పార్క్‌లలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో మల్లె, బంతి, చేమంతి, గులాబి, గన్నేరు, నైట్ క్వీన్, డేకింగ్, విష్ణుచక్రం, మందార వంటి పూల మొక్కలతోపాటు ఫెర్న్, క్రోటాన్ వంటి పుష్పించని మొక్కలు కూడా ఉంటున్నాయి. నైట్ క్వీన్ వంటి మొక్కలు మంచి సువాసనను వెదజల్లుతాయి. మనీ ప్లాంట్, క్రోటాన్ వంటి మొక్కలను నీడ ప్రాంతంలో పెంచుతారు.
ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మొక్కలు వివిధ ఔషధాల తయారీలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఔషధ మొక్కల గురించి అధర్వణ వేదంలో కూడా ప్రస్తావించారు. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి కొన్ని లక్షణాలు ఉన్న మొక్కలను పరిశీలిస్తే.. వేప నుంచి లభించే నింబిన్, నింబిడిన్ అనేవి చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయి. వేపను ‘హెర్బల్ డాక్టర్ ఇన్ ఇండియా’ అంటారు.
- తులసి నుంచి కాంపర్ అనే ఔషధం లభిస్తుంది. ఇవి చెవి పోటు, శ్వాసకోశ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. లావెండర్ నుంచి సుగంధ తైలాలు లభ్యమవుతాయి. డిజిటాలిస్ నుంచి లభించే డిజిటాలిన్ హృదయ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. అట్రోపా బెల్లడోనాలో ఉండే ఆట్రోపిన్ కంటి పరీక్షలలో తోడ్పడుతుంది.
- సింఖోనా మొక్క బేరడు నుంచి లభించే క్వినైన్ మలేరియా వ్యాధిని నయం చేస్తుంది. రక్కీసు లేదా నల్ల మందు మొక్క కాయలో ఉండే మార్ఫీన్ నొప్పిని తగ్గించి నిద్ర పోవడానికి తోడ్పడుతుంది. సర్పగంధి వేరులోని రిసర్పిన్‌ను జీర్ణ కోశ వ్యాధుల, పాము కాటేసిన సమయంలో చికిత్సకు ఉపయోగిస్తారు.
- దతూర పత్రాల నుంచి లభించే స్ట్రమోనియంను ఆస్తమా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. కలబంద నుంచి తయారు చేసే ఔషధం పైల్స్‌ను నయం చేస్తుం ది. పెన్సీలియం క్రైపోజినం అనే శీలింధ్రం నుంచి పెన్సిలిన్ యాంటీ బయాటిక్‌ను తయారు చేస్తున్నారు.
- పసుపు ఒక యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. ఇది అల్సర్, జాండిస్, చర్మ సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. కాల్చిసిన్ అనే ఆల్కలాయిడ్‌ను గౌట్, రూమాటిసం వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఫేరులా వేళ్ల నుంచి లభించే ఇంగువ జీర్ణకోశ సంబంధ, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నివారణలో తోడ్పడుతుంది.
- అశ్వగంధ వేర్లు దగ్గు, రూమాటిసం, అల్సర్ వంటి వ్యాధులను నయం చేస్తాయి. అల్లం, శొంటి అనేవి పన్ను నొప్పి, కంటి సంబంధ వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. స్మైలాక్స్ నుంచి లభించే సరసపరిల్లా చర్మ, నాడీ సంబంధ రుగ్మతలకు పని చేస్తుంది.
- దాల్చిన చెక్క డయేరియా, డయాబెటిస్‌ను తగ్గిస్తుంది. ఎపిడ్రా నుంచి లభించే ఎపిడ్రిన్ ఆల్కలాయిడ్ జలుబు, ఆస్తమా వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది. అట్రోపా నుంచి లభించే అట్రోపిన్ ప్లాస్టర్స్ తయారీకి తోడ్పడుతుంది. క్రోకస్ (కుంకుమ పువ్వు) కీలం, కీలాగ్రాలు, నాడీ, మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తాయి.
పారిశ్రామికంగా కూడా మొక్కలు వివిధ రూపాల్లో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా పేపర్ తయారీలో సైపరస్ పల్ప్ అనే మొక్కను వినియోగిస్తున్నారు. టేకు, మేఖేలియా వంటి వాటి నుంచి ఫ్లైవుడ్‌ను, పెన్సిల్ వంటి వాటిని జానిపెరస్ మొక్కల నుంచి తయారు చేస్తున్నారు. మల్బరి, డాల్‌బిర్జియా వంటి మొక్కల నుంచి హాకీ స్టిక్స్‌ను రూపొందిస్తున్నారు. బిలియర్డ్స్ క్యూస్ తయారీలో ఏసర్ వంటి మొక్కలు తోడ్పడుతున్నాయి. అదేవిధంగా సబ్బుల పరిశ్రమలో కానుగ, కాండిల్స్ తయారీలో మదుక (ఇప్ప), పాం ఆయిల్ కోసం ఇలేయిస్ వంటి మొక్కలను ఉపయోగిస్తున్నారు.
- రెసిన్స్ అనేది పైనఫ్ వంటి మొక్కల నుంచి తయారవుతుంది. దీన్ని వార్నిష్, పెయింటిగ్స్‌లో ఉపయోగిస్తారు. టానిన్స్‌ను ఔషధాల తయారీ, తోళ్ల శుద్ధిలో వినియోగిస్తారు. ఉదాహరణ తంగేడు, తుమ్మ, బాదాం. ఇంక్ (సిరా)ను క్వెర్కస్ టానిన్స్ నుంచి తయారు చేస్తారు.
- లేటెక్స్ వంటి పదార్థం నుంచి రబ్బర్ తయారు చేస్తారు. ఉదాహరణకు హేవియా, ఫైకస్.
- కొన్ని మొక్కల నుంచి నేరుగా రసాయనిక పదార్థాలు తయారవుతాయి. నిమ్మ నుంచి ఆస్కార్బిక్ ఆమ్లం, చింత పండు నుంచి టార్టారిక్ ఆమ్లం ఉత్పన్నమవుతుంది. వీటితోపాటు కొన్ని నీలి ఆకుపచ్చు శైవలాలు నత్రజని స్థాపన కు దోహదం చేయటంతోపాటు పంట దిగుబడిని అధికం చేస్తాయి. నాస్టాక్, అనబినా, రైజోబోబియం బాక్టీరియా ఈ చర్యలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. క్రిసాంథిమం (పైరిధ్రిన్) మొక్కలు, కొన్ని రకాల బ్యాక్టీరియాల నుంచి బయో ఫెస్టిసైడ్స్ తయారవుతున్నాయి.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్త రకం మొక్కలను సృష్టిస్తున్నారు. ఇవి మానవ సంక్షేమానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు బీటీ కాటన్, గోల్డెన్ రైస్ వంటి మొక్కలు. అంతేకాకుండా జెనెటిక్ ఇంజనీరింగ్, కణజాల వర్థనం వంటి పద్ధతుల్లో కూడా నూతన మొక్కలను రూపొందిస్తున్నారు. జూట్, గోగునార, ఆలొవీరా, కొబ్బరి వంటి మొక్కల నుంచి నారలు లభిస్తాయి. పత్తి నుంచి లభించే కేశాలలో సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుంది. పొంగామియా (కానుగ), జట్రోపా వంటి మొక్కల నుంచి బయో డీజిల్‌ను తయారు చేస్తారు.
కృత్రిమ పద్ధతుల ద్వారా
- కృత్రిమ పద్ధతుల ద్వారా అలంకరణ, ఉద్యానవన మొక్కలను తయారు చేస్తున్నారు. ఇందుకోసం చేదనం, అంటుకట్టడం వంటి విధానాలను అనుసరిస్తున్నారు.
- చేదనాల ద్వారా మందార, గులాబి, స్వర్ణ గన్నేరు (టికోమా), డాలియా, జిరేనియం మొక్కలను రూపొందిస్తున్నారు. వేళ్ల చేదనాల ద్వారా క్యారెట్‌ను తయారు చేస్తున్నారు.
- అంటు కట్టే విధానంలో ఉపయోగించే మొక్కను ‘స్టాక్’ అని, దానిపై అంటు కట్టే కొమ్మను ‘సియాన్’ అంటారు. అంటుకట్టడంలో అప్రోచ్, క్లెప్ట్, టంగ్, బడ్ అనే పద్ధతులు ముఖ్యమైనవి.
- అంటు బొక్కుట లేదా అంటు కట్టు విధానం ద్వారా దానిమ్మ, జామ, నారింజ వంటి మొక్కలను రూపొందిస్తున్నారు. దీన్నే గూటి పద్ధతి అని కూడా అంటారు. నేల అంటు తొక్కుట పద్ధతిలో గులాబి, ద్రాక్ష, ఐపోమియా వంటి మొక్కలను వృద్ధి చేస్తున్నారు.
Published date : 22 Aug 2014 04:31PM