Skip to main content

TS Police Jobs 2022 : తెలంగాణ పోలీసు ఉద్యోగాల‌కు కటాఫ్‌ మార్కులు ఇలా..కేటగిరీల వారీగా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలోని పోలీసు ఉద్యోగార్థులకు ఊరట లభించింది.

కటా­ఫ్‌ మార్కుల విషయంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబ‌ర్ 2వ తేదీన (ఆదివారం) సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TS Constable Prelims Exam 2022 Primary Key : కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ ఎగ్జామ్ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి 'కీ' లో..

కటాఫ్‌ మార్కులు ఇలా..కేటగిరీల వారీగా.. 

Police Job

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ప్రిలిమినరీ రాత పరీక్షలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు కటాఫ్‌ మార్కులు తగ్గా­యి. సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకా­రం 30% మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హత సాధిస్తారని ప్రకటించింది. వాస్తవానికి గత నియామకాల సమ­యంలో జనరల్‌ కేటగిరీకి 40% మా­ర్కు­లు అర్హతగా ఉండగా.. బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీలకు 30% కటాఫ్‌గా నిర్ధారించారు. ఈసారి జనరల్‌ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీలకు సైతం 30% మార్కు­లు కటాఫ్‌గా ఖరారు చేసి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)

అయితే అన్ని కేటగిరీలకు ఒకే రకమైన మార్కులు నిర్దేశించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కటాఫ్‌ తగ్గిస్తూ కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనరల్‌ కేటగిరీకి కటాఫ్‌ మార్కులు 10% తగ్గడంతో.. మిగతా కేటగిరీలకు కటాఫ్‌ తగ్గిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేటగిరీల వారీగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

బీసీ అభ్యర్థులకు..
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అక్టోబ‌ర్ 2వ తేదీన (ఆదివారం) కటాఫ్‌ మార్కులు తగ్గిస్తూ అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం బీసీ అభ్యర్థులకు 25%, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీకి 20% మార్కులు కటాఫ్‌గా ఖరారు చేసింది. తాజా నోటిఫికేషన్‌ను టీఎ­స్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు వారి వివరాలను అప్‌లోడ్‌ చేసేందుకు అక్టోబ‌ర్‌ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో..

KCR

కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగ‌స్టు 28వ తేదీ (ఆదివారం) ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జరిగిన విష‌యం తెల్సిందే. ఈ ప్రిలిమినరీ రాత‌ పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో​ సీఎం కేసీఆర్‌ కటాఫ్‌ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ‌లో సివిల్‌ కానిస్టేబుల్‌ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు ఈ ప‌రీక్ష నిర్వ‌హించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. 6,61,196 మంది అభ్య‌ర్థులు ఈ ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91.34 శాతం మంది పరీక్షకు హాజ‌ర‌య్యారు.

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’  కోసం క్లిక్ చేయండి

తప్పుడు సమాధానానికి..
కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహించారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు.

వీటిలో ఇంగ్లిష్‌ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రంలో, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్‌ మార్కు ఉంటుంది.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

Published date : 03 Oct 2022 01:07PM
PDF

Photo Stories