TS Constable Preliminary Exam Key : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ముగిసిన తర్వాత.. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం, ‘కీ’ ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ఇవ్వనున్నది. ఈ ‘కీ’ ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నది.
TS Police Recruitment: ప్రిలిమ్స్ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..
TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)
ఈ జాగ్రత్త పాటించాల్సిందే..
☛ అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.
☛ అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్ తీసుకోవాలి.
☛ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్ అసమగ్రంగా ఉన్నా పరీక్షకు అనుమతించరు.
☛ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.
☛ పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్ వేలిముద్ర తీసుకుంటారు.
☛ పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఏదీ ఉండదు.
☛ చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.
☛ హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.
Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్ ఇదే.. ఇలా చదివితే..
Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!
6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు..
ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష కొశ్చన్ పేపర్ & ‘కీ’ కోసం క్లిక్ చేయండి
ప్రిలిమినరీ పరీక్ష విధానం ఇలా..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..