Skip to main content

TS High Court Break Constable Recruitment 2023 : ఈ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌.. కార‌ణం ఇదే.. ఈ 4 మార్కుల‌ను కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఉద్యోగ నియామకాల ప్ర‌క్రియ ముందుకు సాగేలా క‌న్పించ‌డం లేదు. ఇటీవ‌లే తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
 Recruitment progress in Telangana, Telangana High Court Orders To Stop Constable Recruitment Telugu News
Telangana High Court Orders To Stop Constable Recruitment

ఈ సమయంలో తెలంగాణ సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌ వేస్తూ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు ఆట‌కం ఏర్పడింది. 

ఎందుకంటే..?
తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ రాత‌ప‌రీక్షలో ఇచ్చి ప్ర‌శ్న‌ప‌త్రంలో 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని కానిస్టేబుల్ నియామక బోర్డును హైకోర్టు తప్పుబట్టింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

☛ TS Constable Final Exam Question Paper and Key 2023 : కానిస్టేబుల్‌ ఫైనల్‌ రాత పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & కీ.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు..

ఈ నాలుగు మార్కులు క‌లిపి..

Telangana High Court Orders To Stop Constable News in Telugu

దీనిపై విచారించిన హైకోర్టు.. మెయిన్స్‌ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలంటూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌కి ఆదేశించింది.

☛ TS Constable Cut off Marks 2023 : టీఎస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు ఇవే.. కొంపముంచిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..

ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు..
సివిల్ కానిస్టేబుల్‌కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలలో పేర్కొన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీషులో ప్రశ్నలుండటంతో గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

☛ TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

నియామక ప్రక్రియ మ‌రింత‌ ఆలస్యమయ్యే అవకాశం..
అయితే.. అవి సరిగానే ఉన్నట్లు పోలీసు నియామక మండలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇంగ్లీషు పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. 4 ప్రశ్నలను తొలగించి ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని.. దాని తర్వాత నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Published date : 11 Oct 2023 02:28PM

Photo Stories