TS Constable Preliminary Exam 2022 Question Paper : తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ కోసం క్లిక్ చేయండి
సివిల్ కానిస్టేబుల్ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు .
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో అందుబాటులో ఉంది.
TS SI Preliminary Exam 2022 Key : ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ విడుదల.. అర్హత మార్కులు ఇవే..
మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలను..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహించారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రంలో, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కు ఉంటుంది.