TS Constable Final Exam Preliminary Key 2023 : కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ఈ ప్రశ్నలకు..
అభ్యర్థులకు ఈ ప్రాథమిక ‘కీ’ పైన ఏవైనా అభ్యంతరాలు ఉంటే www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా తెలపవచ్చును తెలుపవచ్చు.
ఒక్కో అభ్యంతరానికి ఒక్కో టెంప్లెట్ ఉపయోగించాల్సి ఉంటుంది. తమ అభ్యంతరాన్ని ధ్రువీకరించే ఆధారాలను కూడా అందులోనే అప్‌లోడ్ చేయొచ్చు. మే 24వ తేదీ వరకూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.
16,321 కానిస్టేబుల్ పోస్టులకు..
తెలంగాణ పోలీసుశాఖలోని వివిధ విభాగాలతోపాటు ఆబ్కారీ, రవాణాశాఖల్లో కానిస్టేబుళ్ల భర్తీకి ఏప్రిల్ 30వ తేదీన తుది పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. సివిల్, ఏఆర్ పోస్టులతోపాటు టీఎస్‌ఎస్పీ, ఎస్పీఎప్, ఫైర్, జైళ్లశాఖ, ఎక్సైజ్, రోడ్డు ట్రాన్స్‌పోర్టు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 16,321 కానిస్టేబుల్ పోస్టులకు ఈ భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు.
తెలంగాణ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఇదే..