NPDCLలో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉత్తర మండల డిస్కంలో 100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. డిగ్రీ, తత్సమాన విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి సర్టిఫికెట్ పొందిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
18–44 ఏళ్లలోపు వయసున్న వారు ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 29న తుది గడువని, మే 22 నుంచి హాల్‌టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
చదవండి: TSNPDCL Jobs Notification 2023: టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ లో 157 పోస్టులు.. నెలకు రూ.35,000 జీతం
మే 28న రాతపరీక్ష ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలు, దరఖాస్తుల సమర్పణకు http://tsnpdc l.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
చదవండి: TS NPDCL : ఎన్పీడీసీఎల్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు.. ఇలాంటి కథనాలను నమ్మవద్దు..
Published date : 01 Apr 2023 12:56PM